ఈ నాలుగు రోజులే కీలకం.. బీజేపీ నేతలకు నడ్డా దిశానిర్దేశం

ఈ నాలుగు రోజులే కీలకం.. బీజేపీ నేతలకు నడ్డా దిశానిర్దేశం

హైదరాబాద్, వెలుగు: ఎన్నికల్లో ఈ నాలుగు రోజులే కీలకమని, పార్టీ గెలుపు కోసం కష్టపడాలని బీజేపీ నేతలకు ఆ పార్టీ చీఫ్ జేపీ నడ్డా దిశానిర్దేశం చేశారు. ముఖ్య నేతలు అప్రమత్తంగా ఉంటూ పార్టీ అభ్యర్థులకు ఎప్పటికప్పుడు తగిన సలహాలు, సూచనలు ఇవ్వాలన్నారు. ఆదివారం బీజేపీ స్టేట్ ఆఫీ  సులో పార్టీ ముఖ్య నేతలతో నడ్డా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పోల్ మేనేజ్మెంట్ పై దిశానిర్దేశం చేశారు. ఎస్సీ వర్గీకరణపై మోదీ ఇచ్చిన హామీ, బీసీ సీఎం ప్రకటనకు ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తోందని అడిగి తెలుసుకున్నారు.

రాష్ట్రంలో కనీసం 40 సీట్లలో బీజేపీ బలంగా ఉందని, అక్కడ గెలుపు కోసం ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులుకోవద్దని సూచించారు. సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్న గజ్వేల్, కామారెడ్డిలో పార్టీ పరిస్థితి ఎట్లుందని అడిగి తెలుసుకున్నారు. సమావేశంలో బీజేపీ సంస్థాగత జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్, సహ ప్రధాన కార్యదర్శి శివప్రకాశ్, పార్టీ ఎన్నికల ఇన్ చార్జ్ ప్రకాశ్ జవదేకర్, సహ ఇన్ చార్జ్ సునీల్ బన్సల్ పాల్గొన్నారు.