
రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay devarakonda) నటిస్తున్న లేటెస్ట్ మూవీస్ లో..మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నది VD12 అని చెప్పుకోవాలి. కారణం ఈ సినిమాకు దర్శకుడు గౌతమ్ తిన్ననూరి (Goutham thinnanuri) కావడమే. ఈ దర్శకుడి నుండి వచ్చిన మళ్ళీ రావా, జెర్సీ సినిమాలు ఆడియన్స్ను అలరించాయి.లేటెస్ట్గా VD12 నుంచి క్రేజీ టాక్ వినిపిస్తోంది.
విజయ్ - గౌతమ్ మూవీలోహీరోయిన్స్ విషయంలో ఎటూ తేల్చుకోలేకపోతున్నట్లు సమాచారం.ఇద్దరు బ్యూటీస్లో ఎవరో ఒకర్ని సెలెక్ట్ చేసే పనిలో ఉన్నారు మేకర్స్. అందులో మొదటగా భాగ్యశ్రీ బోర్సే(Bhagyashri Borse). ఈ బ్యూటీ విజయ్ కి జోడిగా నటించడం దాదాపు ఖరారైంది.పుణెకు చెందిన భాగ్యశ్రీ బోర్సే స్టార్ మోడల్‍గా ఫేమస్. క్యాట్బరీ సిల్క్ సహా కొన్ని యాడ్స్ చేశారు. ఈ అమ్మడు యారియాన్ 2 అనే బాలీవుడ్ మూవీతో సినీ ఎంట్రీ ఇచ్చింది.
అంతేకాదు..భాగ్యశ్రీకి సోషల్ మీడియాలోనూ మంచి ఫాలోయింగ్ ఉంది.ప్రస్తుతం మాస్ మహారాజ రవితేజ హీరోగా నటిస్తున్న ‘మిస్టర్ బచ్చన్’ లో హీరోయిన్‍గా నటిస్తుంది.ఇప్పుడు ఆల్మోస్ట్ విజయ్ దేవరకొండ సరసన నటించే ఛాన్స్ దక్కించుకున్నట్లు టాక్ వినిపిస్తోంది.
Also Read : అనిల్ రావిపూడి, వెంకటేష్ కాంబోలో మరో చిత్రం
అలాగే ప్రేమలు ఫేమ్ మమితా బైజూ(Mamitha Baiju)ను కూడా కన్ఫమ్ చేసినట్లు మరో వార్తా కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. తెలుగు ఆడియన్స్ కు పాపులర్ ఐకాన్ గా పేరు తెచ్చుకుంది. మరి ఈ అమ్మడుకి విజయ్ సరసన నటించే అవకాశం వచ్చిందో లేదో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.
VD 12ని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద ప్రొడ్యూసర్ నాగ వంశీ నిర్మిస్తున్నారు. నిజానికి సినిమా పూజా కార్యక్రమంతో మొదలుపెట్టిన సమయంలో విజయ్ దేవరకొండ, శ్రీ లీల హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారని మేకర్స్ ప్రకటించారు అయితే ఈ సినిమా నుంచి శ్రీ లీల తప్పుకుంటున్నట్టు ప్రచారం అయితే ఉంది. త్వరలో మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది
#VD12
— gowtam tinnanuri (@gowtam19) January 13, 2023
This one is special with @TheDeverakonda
Produced by @vamsi84 & #SaiSoujanya @SitharaEnts @Fortune4Cinemas #SrikaraStudios pic.twitter.com/IXM8uCoXxE