వాట్సాప్​​లో ఓట్ల వేట!

వాట్సాప్​​లో ఓట్ల వేట!

యాదాద్రి, వెలుగు : ఉప ఎన్నికలో సోషల్​మీడియాను ఎవరికి నచ్చినట్టు వారు వాడుకుంటున్నారు. వాట్సాప్​లో అయితే మరీ క్రియేటివిటీ ప్రదర్శిస్తున్నారు. ఒక వాట్సాప్​చాటింగ్​లో ఓటర్లను టీఆర్ఎస్​కు ఓటు వేయాలని అభ్యర్థించినట్టు ఒక వీడియో, మంత్రి కేటీఆర్​ను లీడర్​గా చూపిస్తూ మరో వీడియో పోస్ట్​ చేశారు. 'మునుగోడు ఓటర్'​ పేరుతో ఓ వాట్సాప్ గ్రూప్​ క్రియేట్​ చేసినట్టుగా మొదటి వీడియో రూపొందించారు. ఈ వీడియోలో ఇద్దరు చాట్​ ​చేసినట్టుగా ఉంటుంది.

'నమస్తే'తో మొదలై..' ఎలక్షన్​లో టీఆర్ఎస్​ కు ఓటు వేయండి అని కోరడం..బదులుగా  ‘ఎందుకు వెయ్యాలి? వేస్తే మాకేంటి లాభం?’ అని ఓటరు రిప్లై ఇవ్వడం, తర్వాత సంక్షేమ పథకాలకు సంబంధించిన ఫొటోలను పెట్టడం, చివరగా ఆ ఓటరు ‘ఓకే ఓకే వేస్తాను అని అనడంతో పాటు ‘మా తెలంగాణ మా కేసీఆర్​’ అనడంతో వీడియో ముగుస్తుంది. ఇందులో పోస్ట్​ చేసిన పథకాల్లో ఆగిపోయిన ‘కంటి వెలుగు' స్కీంను కూడా పెట్టారు. రెండో వీడియోలో మంత్రి కేటీఆర్​ను లీడర్​గా చూపిస్తూ ఓటు వేయాలని కోరినట్టుగా పోస్ట్​ చేశారు.