కడుపులో తన్ని కౌంటింగ్ సెంటర్ నుంచి గెంటేశారు: మమత సంచలన ఆరోపణ

కడుపులో తన్ని కౌంటింగ్ సెంటర్ నుంచి గెంటేశారు: మమత సంచలన ఆరోపణ

పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో తాము ఓడిపోలేదని..  BJP, ఈసీ కుట్ర వల్లే ఫలితాలు తారుమారయ్యాయని మాజీ సీఎం మమతా బెనర్జీ అన్నారు.  కేంద్ర ఎన్నికల సంఘమే అతిపెద్ద విలన్‌ అని.. బెంగాల్‌లో సీఈసీ జ్ఞానేష్‌కుమార్‌ విలన్‌గా మారారని విమర్శించారు. ఆయన 100 సీట్లు బీజేపీకి దోచిపెట్టారని ఆరోపించారు. పశ్చిమ బెంగాల్ లో ఘోర పరాజయం తర్వాత 2026 మే 5న  ప్రెస్ మీట్ నిర్వహించారు మాజీ సీఎం మమతా బెనర్జీ. ఎన్నికల సంఘం సహాయంతో బీజేపీ ఓట్లను తారుమారు చేసిందని.. అడ్డుకునేందుకు స్ట్రాంగ్ రూమ్ కు వెళ్లిన తనను కడుపులో తన్ని గెంటేశారని సంచలన ఆరోపణలు చేశారు. 

ఎన్నికల ఫలితాల తర్వాత సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ ఫోన్‌ చేశారని తెలిపారు దీదీ. టీఎంసీ ఇండి కూటమిలోనే ఉందని.. ఇండి కూటమిని మరింత బలోపేతం చేస్తామని తెలిపారు. ఇండి కూటమి తమకు అండగా ఉందని.. బీజేపీ ఓట్ల చోరీపై మరింత పోరాడతామని ఈ సందర్భంగా తెలిపారు. బెంగాల్ లో SIR పేరుతో 90 లక్షల ఓట్లు తొలగించారని ఆరోపించారు. 

►ALSO READ | విజయ్ సీఎం అయినా విడాకుల కేసులో కోర్టుకు వెళ్లాల్సిందేనా..? జూన్ 15న ఏం జరగబోతోంది..?

బీజేపీకి ప్రతిపక్ష నేతల్ని టార్గెట్‌ చేయడం అలవాటేనని.. వందకుపైగా సీట్లను బీజేపీ చోరీ చేసిందని దీదీ ఆరోపించారు. మోడీ, అమిత్‌ షా కనుసన్నల్లోనే ఓట్ల తొలగింపు ప్రక్రియ జరిగిందన్నారు.  తమకు ఇండియా బ్లాక్‌ మద్దతు ఉందని.. విలన్లపై పోరాటం చేశామని.. మరిన్ని పోరాటాలు చేస్తామని తెలిపారు.