సీఎం వస్తున్నారని పిల్లలతో పని చేయించిన్రు

సీఎం వస్తున్నారని పిల్లలతో పని చేయించిన్రు

కౌడిపల్లి, వెలుగు : సీఎం కేసీఆర్ మెదక్ వస్తున్నారని కౌడిపల్లి మండలం తునికి మహాత్మా జ్యోతిబాపూలే గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ శివప్రసాద్ బుధవారం ఉదయం నుంచి 150 మంది విద్యార్థులతో రోడ్ల పక్కన ముళ్లపొదలు, చెత్తాచెదారం తీయించారు.

రాజకీయ నాయకుల కోసం విద్యార్థులను లేబర్ గా మార్చడమేంటని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రిన్సిపల్​ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయమై ప్రిన్సిపల్ ను వివరణ కోరగా స్టూడెంట్స్​తో శభ్రం చేయించాలని జీవో ఉందని, అందుకే వారితో పనులు చేయిస్తున్నామని చెప్పారు. అది సరికాదని స్థానికులు చెప్పడంతో వెంటనే విద్యార్థులను హాస్టల్​లోకి పంపించారు.