డబ్బులు ఇవ్వలేదని బట్టలు విప్పి చెవి కొరికేశారు...

డబ్బులు ఇవ్వలేదని బట్టలు విప్పి చెవి కొరికేశారు...

ఏపీలోని నంద్యాల ఆటోనగర్ శివారులో దారుణం చోటు చేసుకుంది. డబ్బులు ఇవ్వలేదని ఓ వ్యక్తి బట్టలు విప్పి చెవి కొరికేశారు కొంతమంది దుండగులు.లోకేష్ రెడ్డి అనే వ్యక్తి ఓ ప్రయివేట్ స్కూల్ లో పంక్షన్ కు వెళ్ళి తిరిగి వస్తుండగా.. లాయర్ శివ మరికొంతమంది వ్యక్తుల మధ్య ఘర్షణ మొదలైంది. అటుగా వెళ్తున్న లోకేష్ రెడ్డిని అడ్డగించారు లాయర్ శివ మనుషులు. డబ్బులు ఇచ్చేందుకు లోకేష్ నిరాకరించటంతో ఘర్షణ మొదలైందని లోకేష్ బంధువులు చెబుతున్నారు.

ఘర్షణలో లోకేష్ చెవిని కొరికేశారు లాయర్ శివ మనుషులు. కొరికిన చెవిని తీసుకు వెళ్ళి నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో కుట్లు వేయించుకున్నాడు లోకేష్ .ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.