శ్రీశైలానికి సందర్శకుల తాకిడి.. భారీగా ట్రాఫిక్ జామ్

శ్రీశైలానికి సందర్శకుల తాకిడి.. భారీగా ట్రాఫిక్ జామ్

వీకెండ్ కావడంతో శ్రీశైలానికి సందర్శకుల తాకిడి మరింత పెరిగింది. శ్రీశైలం ఘాట్ రోడ్లన్నీ ట్రాఫిక్ జాం అయ్యాయి. దోమల పెంట ఫారెస్ట్ చెక్ పోస్టు నుంచి 12కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. జలాశయం గేట్లు ఎత్తడంతో డ్యామ్ చూసేందుకు రోడ్డుపక్కకు కవాహనాలు నిలిపివేయడంతో భారీగా ట్రాఫిక్ జాం అయినట్లు తెలుస్తోంది. ట్రాఫిక్ ను క్లియర్ చేసేందుకు పోలీసులు అవస్థలు పడుతున్నారు.

శ్రీశైలం జలాశయానికి ఎగువ పరీవాహక ప్రాంతాల నుంచి భారీగా వరద ఉధృతి పెరుగుతోంది. జలాశకం గేట్లు ఎత్తి 4 లక్షల క్యూసెక్కులకు పైగా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో నాగార్జునసాగర్ జలాశయానికి భారీగా వరద పోటెత్తింది. శ్రీశైలం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం 883అడుగులకు చేరింది. పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 215 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 210టీఎంసీలుగా ఉంది. 

ALSO READ | భారీ వర్షాలతో అన్ని జలాశయాలకు కళకళ