గత ప్రభుత్వం వేల మంది ఫోన్లు ట్యాపింగ్ చేయించి బ్లాక్ మెయిల్ చేసిందని రాహుల్ గాంధీ ఆరోపించారు. శనివారం జరిగిన తుక్కుగూడ జనజాతర సభలో ఆయన ఫోన్ ట్యాపింగ్ కేసు గురించి మాట్లాడారు. గత ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేసి ఆ డేటాను ద్వంసం చేయడానికి ప్రయత్నించిందని ఆయన అన్నారు. ఇంతకు ముందున్న సర్కార్ ఇంటెలిజెన్స్, పోలీసుల సేవలు దుర్వినియోగం చేసి ప్రతిపక్షనాయకుల, అధికారుల ఫోన్లు టాపింగ్ చేసిందని రాహుల్ గాంధీ అన్నారు. బీఆర్ఎస్ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడిందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ఫోన్లు చేసి బ్లాక్‌మెయిల్ చేశారని, భయపెట్టి బలవంతపు వసుల్లకు పాల్పడ్డారని అన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పని మొదలు పెట్టిందని.. దాని ఫలితాలు కూడా మీ మందందని చెప్పారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ ఎలాంటి అక్రమాలకు పాల్పడ్డారో.. ఢిల్లీలో మోదీ కూడా అలాంటి బెదిరింపు రాజకీయాలే చేశాడని రాహుల్ గాంధీ అన్నారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డిపార్ట్‌మెంట్ ఇప్పుడు బలవంతపు వసూల్ల డిపార్ట్ మెంట్ గా మారిందని కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించారు. దేశంలో అవినీతి పరులంతా, అవినీతి మంత్రులు, నేతలు అందరూ నరేంద్ర మోదీ పార్టీలోనే ఉన్నారని, బీజేపీ వాషింగ్ మెషిన్ ప్రొగ్రామ్ చేస్తోందని, ఆ పార్టీకి ఎదురు తిరిగిన నాయకులపై కేసుల పాలు చేస్తుందని ఆరోపించారు.