బ్యాట్తో కొట్టి, కండ్లలో కారం చల్లి.. మహిళ పుస్తెలతాడు లాక్కెళ్లిండు

బ్యాట్తో కొట్టి, కండ్లలో కారం చల్లి.. మహిళ పుస్తెలతాడు లాక్కెళ్లిండు
  • దొంగను పట్టుకుని పోలీసులకు అప్పగింత

చేవెళ్ల, వెలుగు: ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళపై బ్యాట్ తో దాడి చేసి కంట్లో కారంపొడి చల్లి ఓ వ్యక్తి చైన్​స్నాచింగ్​కు పాల్పడ్డాడు. రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లికి చెందిన కుంబారి సిద్ధారెడ్డి స్థానికంగా హోటల్ నడిపిస్తున్నాడు. సమీపంలోనే అద్దె ఇంట్లో నివాసముంటున్నాడు. తన భార్య వినీత బుధవారం హోటల్​లో పని ముగించుకుని వంట చేసేందుకు ఇంటికి వెళ్లింది. ఈ క్రమంలో ఓ వ్యక్తి ఇంట్లోకి వచ్చి ఆమెపై బ్యాటుతో దాడి చేశాడు.

 కండ్లలో కారం చల్లి మెడలో పుస్తెలతాడు ఎత్తుకెళ్లాడు. జరిగిన విషయాన్ని వినీత తన భర్త సిద్ధారెడ్డికి చెప్పింది. వెంటనే ఆయన తన పనివాళ్లతో కలిసి దుండగుడిని పట్టుకునేందుకు వెళ్లాడు. ఘటనా స్థలానికి సమీపంలో వాటర్ వాష్ దొంగను పట్టుకున్నారు. తమ హోటల్​ ఎదురుగా అద్దెకు ఉండే ప్రవీణ్​గా గుర్తించారు. నిందితుడిని పోలీసులకు అప్పగించగా, మూడున్నర తులాల బంగారు పుస్తెలతాడును స్వాధీనం చేసుకున్నారు.