
- సెల్ఫోన్ల దొంగను పట్టించిన రోడ్డు ప్రమాదం
గండిపేట, వెలుగు: ఆరు సెల్‌ఫోన్లు కొట్టేసి పారిపోతున్న దొంగ రోడ్డు ప్రమాదానికి గురై పోలీసులకు చిక్కాడు. ఈ ఘటన నార్సింగి పోలీస్‌స్టేషన్ పరిధి హైదర్షాకోట్‌లో జరిగింది. వికారాబాద్‌జిల్లా పరిగి మండలం మాల్కాపురం గ్రామానికి చెందిన మహేశ్ చోరీలకు అలవాటు పడ్డాడు. శనివారం హైదర్షాకోట్ఏరియాలో మొత్తం 6 సెల్‌ఫోన్లు కొట్టేశాడు. వాటిని జేబులో పెట్టుకుని వెళ్తూ రోడ్డు దాటుతుండగా బైక్ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మహేశ్గాయపడ్డాడు.
అయ్యో పాపం అంటూ స్థానికులు అతన్ని కాపాడేందుకు దగ్గరకు వెళ్లగా, అతని జేబులో నుంచి పడిపోయిన 6 సెల్‌ఫోన్లు కనిపించాయి. దొంగ అని తెలుసుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. నార్సింగి పోలీసులు అక్కడికి చేరుకుని సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. మహేశ్‌ను స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేశారు.