సాఫ్ట్‌వేర్ ఎంప్లాయ్ సినిమాకెళ్లి వచ్చేసరికి.. ఇంట్లో అంతా అయిపోయింది

సాఫ్ట్‌వేర్ ఎంప్లాయ్ సినిమాకెళ్లి వచ్చేసరికి.. ఇంట్లో అంతా అయిపోయింది

సంగారెడ్డి జిల్లా ఆదివారం ( నవంబర్ 3) దొంగలు బీభత్సం సృష్టించారు. భానూర్ గ్రామంలోని లైఫ్ స్టైల్ డ్రీమ్ హోమ్స్ లోని ఓ ఇంట్లో భారీగా బంగారం, వెండి లూఠీ చేశారు దొంగలు. బాధితులు సినిమా చూడటానికి వెళ్లి తిరిగి ఇంటికి వచ్చే సరికే.. దొంగలు తాళం పగులగొట్టి బీరువాలో ఆభరణాలు చోరీ చేశారు. దుండగులు 25 తులాల బంగారం, 10 తులాల వెండి,  రూ.5 వేల నగదుతో పాటు 3 ఖరీదైన వాచీలు ఎత్తుకెళ్లారు. 

Also Read :- అంబులెన్స్‌లో ప్రయాణం.. కేంద్ర సహాయ మంత్రిపై కేసు నమోదు

బిడిఎల్  భానూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లైఫ్ స్టైల్ డ్రీమ్ హోమ్స్ కాలనీ  - 342 ఫ్లాట్‪లో నివాసముంటున్న సాప్ట్ వెర్ ఉద్యోగి నందారపు శరత్ ఇంట్లో  చోరీ జరిగింది. ఆదివారం కదా అని.. బాధితుడు కుటుంబంతో సరదాగా సినిమాకి వెళ్లాడు. వచ్చి చూసే సరికి దొంగలు రూ.25లక్షల విలువైన వస్తువులను చోరీ చేశారు. సంఘటన  స్థలానికి అడిషనల్ ఎస్పీ సంజీవ రావు వచ్చి కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.