అల్వాల్ : శుభలేఖలు ఇవ్వడానికి వెళ్లిన ఫ్యామిలీ ఇంట్లో 29 తులాల గోల్డ్ చోరీ

అల్వాల్ : శుభలేఖలు ఇవ్వడానికి వెళ్లిన ఫ్యామిలీ ఇంట్లో 29 తులాల గోల్డ్ చోరీ
  •     విలువ సుమారు రూ.40 లక్షలు
  •     28 తులాల వెండి, లక్ష ఇరవై వేల నగదు కూడా మాయం..

అల్వాల్ వెలుగు:  శుభలేఖలు ఇవ్వడానికి వెళ్లగా దొంగలు ఇల్లు గుల్ల చేశారు. జానకీ నగర్ కాలనీకి చెందిన గంటి సుబ్రహ్మణ్య కార్తీక్  కుటుంబ సభ్యులు దమ్మాయిగూడలో పెండ్లి పత్రికలు ఇవ్వడానికి వెళ్లారు. ఇది గమనించిన ఓ దొంగ శనివారం రాత్రి ఇంటి తాళాలు పగులగొట్టి లోపలికి ప్రవేశించాడు. బెడ్​రూమ్​లో బీరువా తెరిచి 29 తులాల బంగారం, 27 తులాల వెండి, రూ.1.2 లక్షల నగదును..వెంట తెచ్చుకున్న టవల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పెట్టుకుని పరారయ్యాడు.  

తిరిగి వచ్చిన కార్తీక్ కుటుంబ సభ్యులు జరిగింది చూసి  అల్వాల్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి సీసీ ఫుటేజీలు పరిశీలించగా ఓ వ్యక్తి ఇంట్లోకి ప్రవేశించి చోరీకి పాల్పడినట్లు కనిపించింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడి కోసం గాలిస్తున్నారు.