రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఇంట్లో 100 తులాల బంగారం చోరీ

రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఇంట్లో 100 తులాల బంగారం చోరీ


రంగారెడ్డి జిల్లా  నార్సింగీ పోలీస్ స్టేషన్  పరిధిలో భారీ చోరీ జరిగింది.  రిటైర్డ్ ఐఏఎస్ అధికారి హరిబాబు ఇల్లు గుల్ల చేశారు. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి  వంద  తులాల బంగారంతో పాటు ఓ లాప్ టాప్ ఎత్తుకెళ్లారు.  ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులతో విజయవాడ వెళ్లారు హరిబాబు.  తెల్లవారుజామున ఇంటికి తిరిగి వచ్చిన కుటుంబం ఇంట్లో చోరీ జరిగినట్లు గుర్తించారు.  ఇంటి తాళాలు పగలగొట్టి ఇంట్లో ఉన్న బంగారం, లాప్ టాప్ దొంగలించారని చెప్పారు.  కేసు నమోదు చేసిన నార్సింగ్ పోలీసులు  దర్యాప్తు చేస్తున్నారు.