‘తిమ్మరాజుపల్లి టీవీ’ సినిమా నిర్మాతగా తనకెంతో సంతృప్తిని ఇచ్చింది అని కిరణ్ అబ్బవరం అన్నాడు. కొత్త వాళ్లను ఎంకరేజ్ చేస్తూ ఆయన నిర్మించిన ఈ చిత్రం ఇటీవల థియేటర్స్‌లో విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈనెల 15 నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్‌కు రాబోతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ ‘నా సక్సెస్, ఫెయిల్యూర్స్‌లో ఆహా తోడుగా ఉంది. రామ్ గారు, అరవింద్ గారు కిరణ్ సినిమా అంటే నమ్మకంతో తీసుకుంటారు.
‘తిమ్మరాజుపల్లి టీవీ’ సినిమా విషయంలో సంతృప్తిగా ఉన్నా. ఇలాంటి కాంపాక్ట్ బడ్జెట్‌లో మేం అచీవ్‌మెంట్ చేశాం. అది మా టీమ్ వల్లే సాధ్యమైంది. ఇదొక మంచి సినిమా అనే ఇంప్రెషన్ ఫ్యామిలీ ఆడియెన్స్‌లో ఉంది. వాళ్లంతా ఆహాలో మా మూవీ చూస్తారని ఆశిస్తున్నా. మంచి నోస్టాల్జిక్ ఫీల్ ఇచ్చే చిత్రమిది’ అని అన్నాడు. హీరో సాయితేజ్ మాట్లాడుతూ ‘మా సినిమాకు ఆడియెన్స్ థియేటర్స్‌లో మంచి సక్సెస్ అందించారు. ఇప్పుడు ఆహా ద్వారా మరింత మందికి రీచ్ అవుతుండటం ఆనందంగా ఉంది’ అని అన్నాడు.
ఆహాలోనూ తమ సినిమాకు మంచి ఆదరణ దక్కుతుంది అని హీరోయిన్ వేద జలంధర్ చెప్పింది. డైరెక్టర్ వి.మునిరాజు మాట్లాడుతూ ‘ ఈ సినిమాతో మేము ఎలాంటి విజయాన్ని ఆశించామో, ఎలాంటి రెస్పాన్స్ ఆశించామో అది దక్కింది. ఆహాలో కూడా సక్సెస్ చేయాలని కోరుకుంటున్నా’ అని అన్నాడు. ఆహా శ్రీనివాస్, నటులు ప్రదీప్ కొట్టె , స్వాతి కరిమిరెడ్డి, ఆర్ట్ డైరెక్టర్ సుధీర్ మాచర్ల, మ్యూజిక్ డైరెక్టర్ వంశీకాంత్ రేఖన పాల్గొన్నారు.
