Think Positive: ఆరోగ్యంగా, ఆనందంగా జీవించడానికి ఆరు సూత్రాలు

Think Positive: ఆరోగ్యంగా, ఆనందంగా జీవించడానికి ఆరు సూత్రాలు

పాజిటివ్నెస్..ఈ దృక్పథం జీవన నాణ్యత మెరుగుపడుతుంది. శరీర బలం మరింత పెంచుతుంది.గాయాలు లేదా అనారోగ్యాల నుంచి త్వరగా కోలుకునేలా చేస్తుంది. మొత్తంగా మీ ఆయుర్దాయం పెంచుతుంది. మరీ పాజిటివ్ దృక్పథాన్ని ఎలా పెంచుకోవాలి.

సానుకూలంగా ఎలా ఆలోచించవచ్చో ఇక్కడ కొన్ని మార్గాలు...
మనిషి జీవితం అనేది సుదీర్ఘ ప్రయాణం.. తన జీవితకాలంలో ఎన్నో సంఘటనలు దాటుకుంటూ వెళ్లాలి. అందులో కొన్ని సంఘటనలు మిమ్మల్ని సంతోషపెట్టేవి అయి ఉండవచ్చు. కొన్ని బాధపెట్టేవి అయి ఉండవచ్చు. కానీ చాలా మంది సంతోషకరమైన క్షణాలను త్వరగా మరిచిపోయి, బాధాకరమైనవే ఎక్కువ కాలం వారితో ఉంచుకుంటారు, వాటిలోనే గడుపుతారు. ఎప్పుడూ ఏదో కోల్పోయినట్లుగా ఉంటారు. దీనివల్ల ఒత్తిడి, ఆందోళనలు మరింత పెరుగుతాయి తప్ప ఎలాంటి ప్రయోజనం ఉండదు. మానసికంగా ఆరోగ్యంగా, శారీరకంగా చురుకుగా ఉండాలంటే సానుకూల ఆలోచనలు చేయాలి, సానుకూల దృక్పథంతో ముందుకుసాగాలి.

కొంతమంది జీవితంలో ప్రతికూలతల గురించే ఎప్పుడూ ఆందోళన చెందుతారు. నేను చేయలేను, నావల్ల కాదు అని అనుకుంటారు. కానీ, మరికొందరు ఎప్పుడూ సానుకూలంగానే ఆలోచిస్తారు. ప్రతికూలంగా ఆలోచించే వారి మొఖం ఎప్పుడూ నీరసంగా ఉంటుంది. సానుకూలంగా ఆలోచించేవారి ముఖంలో చిరునవ్వు ఎప్పటికీ పోదు.

ఇటీవలి అధ్యయనాల ప్రకారం.. ప్రజలు చిన్న వయసులోనే గుండెపోటు, స్ట్రోక్, కాలేయం చెడిపోవడం, మదుమేహం వంటి అనేక సమస్యలతో బాధపడుతున్నారు. దీని ఒక కారణం ప్రతికూల ఆలోచనలు చేయడమే కొంత కారణంగా తెలుస్తోంది. ప్రతికూల ఆలోచనలతో నిరంతరమైన ఒత్తిడి, ఆందోళన గురి అవుతుంటాం. ఇది ఆరోగ్యానికి పెనుముప్పుగా పరిణమిస్తుంది. 
సానుకూలంగా ఎలా ఆలోచించవచ్చో ఇక్కడ కొన్ని మార్గాలు చూడండి.

ఎల్లప్పుడూ మంచిని కోరుకోవాలి 
మంచిని కోరడంలోనే సానుకూలత ఉంటుంది. ఇంకొకరికి చెడు చేయాలనుకునే వారి మనసులో ఎప్పుడూ చీకటి ఉంటుంది. ఈ క్రమంలో అన్ని చెడు ఆలోచనలే చేస్తారు. ఎల్లప్పుడూ మంచివైపే ఉంటూ.. మంచి మార్గంలో నడవడానికి ప్రయత్నిస్తే.. అదే మీకు మంచి జీవితాన్ని ఇస్తుంది.
సంతృప్తిగా ఉండండి
మన దగ్గర ఏమీ లేదు అని బాధపడే బదులు.. ఉన్నదానికి సంతృప్తిగా ఉండాలి. ఇతరులతో మిమ్మల్ని, మీ జీవితాన్ని పోల్చుకోకుండా మీలా ఉండడానికి ప్రయత్నించాలి. మీతో మీరే పోటీపడుతూ దినదినాభివృద్ధి చెందాలి. 
మంచి ఆలోచనలు చేయాలి 
ప్రతిరోజూ కొన్ని మంచి ఆలోచలు చేయండి. మంచి పనుల గురించి ఆలోచనలు చేయండి. మీ ఆలోచనలు ఒక పేపర్ పై రాయండి. ఇది మీలో ఆశావాదాన్ని పెంచుతుంది. మీకు క్షణకాలం ఆనందాన్ని కలిగిస్తుంది.
నవ్వుతూ ఉండాలి 
నవ్వు మన ఒత్తిడి, డిప్రెషన్ ను ఒక్కసారిగా మాయం చేస్తుంది. ఇది మీ మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. మీరు నవ్వడానికి కార్టూన్ చూడండి, కామెడీ సీన్లు చూడండి, జోక్స్ చదవండి, మీరు చదివిన జోక్స్ ఇతరులకు చెప్తూ మీరు నవ్వండి, ఇతరులను నవ్విస్తూ సంతోషంగా ఉండండి.

సానుకూలంగా, స్నేహపూర్వంగా ఉండే వారితో సమయం వెచ్చించాలి 
మీ చుట్టూ ఉన్నవారు కూడా మీ ఆలోచనలను ప్రభావితం చేయవచ్చు. కాబట్టి ఎల్లప్పుడూ సానుకూలంగా ఆలోచించే వారితో, మంచి మాట్లాడేవారితో మీ సమయాన్ని గడపండి. మీరు సానుకూల జీవితాన్ని గడపవచ్చు.

ఆరోగ్యకరమై ఆహారం తీసుకోవాలి 
మీరు తినే ఆహారం కూడా మీ ఆలోచనలు, ఆందోళనలకు కారణం అవుతుంటాయి.  కాబట్టి ఆరోగ్యకరమైన ఆహారం తింటే ఆలోచనలు బాగుంటాయి, ఆరోగ్యం బాగుంటుంది. తేలికైన ఆహారం తినడానికి ప్రయత్నించండి. తినే ఆహారానికి తగినట్లుగా శారీరక శ్రమ చేయండి.