వర్ష బొల్లమ్మ లీడ్ రోల్‌లో నటించిన వెబ్ సిరీస్ ‘కానిస్టేబుల్ కనకం’. ప్రశాంత్ కుమార్ దిమ్మల దర్శకత్వం వహించాడు. మేఘ లేఖ, రాజీవ్ కనకాల, శ్రీనివాస్ అవసరాల కీలక పాత్రలు పోషించారు. కోవెలమూడి సత్య సాయిబాబా, వేమూరి హేమంత్ కుమార్ నిర్మించారు.
ఈటీవీ విన్‌లో స్ట్రీమింగ్ అవుతున్న రెండు సీజన్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ‘కానిస్టేబుల్ కనకం చాప్టర్ 3 కాల్ ఘాట్’ను సినిమాగా థియేటర్స్‌లో రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు మేకర్స్. అలాగే రెండు సీజన్స్ కలిపి కూడా థియేటర్స్‌లో విడుదల చేయబోతున్నట్టు తెలియజేశారు.
ఈ సందర్భంగా ‘కాల్ ఘాట్ చాప్టర్ 3’ గ్లింప్స్‌ను దర్శకుడు రాఘవేంద్రరావు, నిర్మాత అశ్వినీదత్ లాంచ్ చేసి టీమ్‌కు బెస్ట్ విషెస్ చెప్పారు. వర్ష బొల్లమ్మ మాట్లాడుతూ ‘ఒక నటిగా సంతృప్తినిచ్చిన సిరిస్ ఇది.
‘చాప్టర్ 3 కాల్ ఘాట్’పెద్ద బాధ్యతగా భావిస్తున్నా. పెర్ఫార్మెన్స్‌కు స్కోప్ ఉన్న క్యారెక్టర్ ఇచ్చిన దర్శక నిర్మాతలకు, మమ్మల్ని బ్లెస్ చేసిన రాఘవేంద్రరావు గారికి, అశ్వినీ దత్ గారికి థాంక్యూ సో మచ్’ అని చెప్పింది.
The story grows bigger.
— ETV Win (@etvwin) January 22, 2026
The mystery gets deeper.
The experience goes larger than life. 🎥🔥
Presenting the glimpse of Constable Kanakam – Chapter 3, an A Win Original Production, coming soon to theatres. 🚔✨
Get ready for the next big chapter.@VarshaBollamma @RajeevCo… pic.twitter.com/LOfRg5NJVw
‘కాల్ ఘాట్’ చాలా ఇంపాక్ట్‌ఫుల్‌గా ఉంటుందని, అందరినీ అలరించబోతోందని డైరెక్టర్ ప్రశాంత్ అన్నాడు. నటుడు రాజీవ్ కనకాల, మ్యూజిక్ డైరెక్టర్ సురేష్ బొబ్బిలి, నిర్మాతలు సత్య సాయిబాబా, హేమంత్ పాల్గొన్నారు.
