హైదరాబాద్, వెలుగు: అమెరికా ఇమిగ్రేషన్ ప్రక్రియపై సమగ్ర అవగాహన కల్పించే ఇమిగ్రేషన్ ఫర్ ఎవ్రీవన్ మూడో ఎడిషన్ పుస్తకాన్ని హైదరాబాద్‌లో ఆవిష్కరించారు. న్యూయార్క్‌కు చెందిన ప్రముఖ న్యాయవాది నరేష్ గెహీ రచించిన ఈ పుస్తకాన్ని నటి అనన్య నాగళ్ళతో కలిసి విడుదల చేశారు. విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారవేత్తలు, పెట్టుబడిదారులకు ఇది ఉపయోగపడుతుంది.
ఈబీ-5 ఇన్వెస్టర్ వీసా సహా పలు వీసా సమాచారాన్ని ఇందులో పొందుపరిచామని, తాజా అమెరికా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లు పాలసీ మార్పులను తెలియజేశామని నరేష్ వివరించారు. సోర్స్ ఆఫ్ ఫండ్స్, డాక్యుమెంటేషన్, ఆర్‌బీఐ ఎల్ఆర్ఎస్ స్కీమ్ వంటి విదేశాల్లో వ్యాపార విస్తరణ చేసే వారికి ఇది మార్గదర్శినిగా ఉపయోగపడుతుందని వివరించారు.
