టార్గెట్ క్లీన్‌‌‌‌‌‌‌‌స్వీప్..ఇవాళ సౌతాఫ్రికాతో ఇండియా విమెన్స్‌‌‌‌‌‌‌‌ మూడో వన్డే

టార్గెట్ క్లీన్‌‌‌‌‌‌‌‌స్వీప్..ఇవాళ సౌతాఫ్రికాతో ఇండియా విమెన్స్‌‌‌‌‌‌‌‌ మూడో వన్డే
  •     మ. 1.30 నుంచి స్పోర్ట్స్‌‌‌‌‌‌‌‌-18లో లైవ్

బెంగళూరు: సొంతగడ్డపై వరుసగా రెండు మ్యాచ్‌‌‌‌‌‌‌‌ల్లో గెలిచి జోరుమీదున్న ఇండియా విమెన్స్‌‌‌‌‌‌‌‌ టీమ్ సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌‌‌‌‌‌‌‌లో క్లీన్‌‌‌‌‌‌‌‌స్వీప్‌‌‌‌‌‌‌‌పై కన్నేసింది. ఆదివారం జరిగే చివరి, మూడో వన్డేలోనూ విజయయే టార్గెట్‌‌‌‌‌‌‌‌గా బరిలోకి దిగనుంది. 

రెండు సెంచరీలతో మంధాన సూపర్ ఫామ్‌‌‌‌‌‌‌‌లో ఉండగా.. రెండో వన్డేలో మెరుపు సెంచరీతో కెప్టెన్‌‌‌‌‌‌‌‌ హర్మన్‌‌‌‌‌‌‌‌ కూడా ఫామ్‌‌‌‌‌‌‌‌ అందుకోవడంతో బ్యాటింగ్ బలం పెరిగింది. ఓపెనర్ షెఫాలీ వర్మ కూడా టచ్‌‌‌‌‌‌‌‌లోకి వస్తే జట్టుకు తిరుగుండదు. మరోవైపు ఈ మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో గెలిచి పరువైనా దక్కించుకోవాలని సౌతాఫ్రికా భావిస్తోంది.