
అనుపమ పరమేశ్వరన్ లీడ్ రోల్‌లో సినిమా బండి, శుభం చిత్రాల దర్శకుడు ప్రవీణ్ కండ్రేగుల తెరకెక్కించిన చిత్రం ‘పరదా’. దర్శన రాజేంద్రన్, సంగీత, రాగ్ మయూర్ కీలకపాత్రలు పోషించారు. శ్రీనివాసులు పివి, శ్రీధర్ మక్కువతో కలిసి విజయ్ డొంకడ నిర్మిస్తున్నారు. మంగళవారం ఈ చిత్రం నుంచి మూడో పాటను రిలీజ్ చేశారు. ‘ఎగరేయ్ నీ రెక్కలే’ అంటూ సాగిన పాటను గోపీ సుందర్ బ్యూటీఫుల్‌గా కంపోజ్ చేయగా, వనమాలి రాసిన లిరిక్స్ మనసుకు హత్తుకునేలా ఉన్నాయి.
రితేష్ జి రావు తన వోకల్స్‌తో ఆకట్టుకున్నాడు. ‘ఎగరేయ్ నీ రెక్కలే.. కలిపేయ్ ఆ దిక్కులే.. నగరాలే నీ హద్దుగా.. అడుగేస్తూ సాగాలిక.. సెలవిక పరదాలకు.. ఎవరాపినా పరుగాపకు.. నిన్నలకు వీడ్కోలని.. రేపటికి స్వాగతించనా..’ అంటూ సాగిన పాటలో అనుపమ పరమేశ్వరన్, దర్శన రాజేంద్రన్, సంగీత.. ముగ్గురు కారులో జర్నీ చేస్తూ కనిపించారు. ఎమోషనల్ అండ్ హార్ట్ టచ్చింగ్‌గా ఉన్న పాట సినిమాపై ఆసక్తిని పెంచింది. ఆగస్టు 22న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.