థర్డ్ వేవ్ వచ్చే ఛాన్సులు తక్కువే

థర్డ్ వేవ్ వచ్చే ఛాన్సులు తక్కువే

న్యూఢిల్లీ: కరోనా సెకండ్ వేవ్ అంత తీవ్రంగా థర్డ్ వేవ్ ఉండకపోవచ్చునని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) పేర్కొంది. మూవో వేవ్ రావడానికి అవకాశాలు తక్కువేనని, ఒకవేళ వచ్చినా రెండో వేవ్ అంత తీవ్రంగా ఉండకపోవచ్చునని స్పష్టం చేసింది. కరోనా తీవ్రతపై ఇంపీరియల్ కాలేజ్ ఆఫ్ లండన్‌తో కలసి ఐసీఎంఆర్ ఓ స్టడీ చేపట్టింది. ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ బలరాం భార్గవ, మెడికల్ ఎక్స్‌పర్ట్ సందీప్ మండల్, సమీరన్ పండా, లండన్‌లోని ఇంపీరియల్ కాలేజ్‌కు చెందిన నిమలన్ అరినమిన్‌పతి సంయుక్తంగా ఓ రీసెర్చ్ పేపర్‌ను రూపొందించారు. ఈ పరిశోధనలోని విషయాలు ఇండియన్ జర్నల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్‌లో ప్రచురితమయ్యాయి. కొత్త వేరియంట్‌కు అధిక సంక్రమణ శక్తి ఉండి, అదే సమయంలో రోగ నిరోధక శక్తిని తప్పించుకోగలగితే థర్డ్ వేవ్ వచ్చే చాన్సెస్ ఉన్నాయని రీసెర్చ్ పేపర్‌లో పేర్కొన్నారు. భవిష్యత్‌లో మరిన్ని కరోనా వేవ్స్ రాకూడదంటే భారీ ఎత్తున వ్యాక్సినేషన్ ప్రక్రియను చేపట్టాలని సూచించారు.