ఈ యాప్.. గృహిణిుల కోసం ప్రత్యేకం

ఈ యాప్.. గృహిణిుల కోసం ప్రత్యేకం

ఆమె స్కూల్​, కాలేజీల్లో ఎప్పుడూ  టాపరే.. కానీ​,పెళ్లి తర్వాత కుటుంబ బాధ్యతల్లో పడి  ఏం చదువుకుందన్న​  ఊసే మర్చిపోయింది. ఫ్యామిలీతో  హ్యాపీగానే ఉంది. కానీ, ఏదో తెలియని వెలితి. ఇంత చదువుకుంది ఇంట్లో ఖాళీగా కూర్చోడానికా? అన్న ప్రశ్న  మొదలైంది. ఇది మన దేశంలో కొన్ని లక్షలమంది హౌస్​వైవ్స్​​ రోజూ  జవాబు వెతికే ప్రశ్నే. మరి దీనికి పరిష్కారమేంటి? అన్న ఆలోచన నుంచి పుట్టిందే ‘హునార్​ ఆన్​లైన్​ కోర్సెస్​’​. హౌస్​వైవ్స్​​ కి  ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ఈ యాప్​ని లాంచ్​​  చేసింది హైదరాబాద్​కి చెందిన నిష్ట యోగేశ్​. ఈ యాప్​ ద్వారా 30 కి పైగా ఆన్​లైన్​ కోర్సుల్లో హౌస్​  వైవ్స్​​ ని ట్రైన్​ చేసి, వాళ్లకో దారి చూపిస్తోంది ఈమె.

విదేశాల్లో చదువుకుంది.  తెలివితేటలకీ కొదవ లేదు. ప్రయత్నిస్తే మల్టీనేషనల్​​ కంపెనీలో ఉద్యోగం గ్యారెంటీ.  లేదంటే సొంతగా కమర్షియల్​ బిజినెస్​ మొదలుపెట్టేది. కానీ, రొటీన్​ బిజినెస్​ ఫార్ములాస్​కి కాస్త భిన్నంగా ఏదైనా చేయాలనుకుంది నిష్ట.  తన పని పదిమంది ఆడవాళ్లకు ఉపాధి కల్పించేదై ఉండాలనుకుంది. మరీ ముఖ్యంగా హౌస్​ వైవ్స్​​ కి ఒక ఐడెంటిటీ ఇవ్వాలనేది ఆమె ఆలోచన. ఆ ఆలోచనలకు రూపంగానే హునార్​ ఆన్​లైన్​ కోర్సెస్​​ అనే యాప్​ని లాంచ్​​ చేసింది.

బిజినెస్​ నా డ్రీమ్

మా అమ్మానాన్నలిద్దరూ  సక్సెస్​ఫుల్​ బిజినెస్​ పర్సన్స్​. చిన్నప్పట్నుంచి వాళ్లని చూస్తూ పెరగడం వల్ల   బిజినెస్​ ఓ ప్యాషన్​గా మారింది నాకు. ఐదేళ్ల వయసు నుంచి  బిజినెస్​ విమెన్​గా ఎదగాలని కలలు కన్నా. ఆ కలల్ని నిజం చేసుకోవడానికి స్కూల్​ డేస్​ నుంచే  మా పేరెంట్స్​ బిజినెస్​లో ఇన్వాల్వ్​ అయ్యేదాన్ని. ప్రొడక్షన్, మార్కెటింగ్ గురించి ప్రాక్టికల్​గా నేర్చుకునేదాన్ని. చదువుని కూడా నా ఆసక్తికి అనుగుణంగానే ఎంచుకున్నా.. ఫైనాన్స్​లో గ్రిప్​ సాధించడానికి సి.ఎ. చదివా. ​ఆ తర్వాత బోస్టన్​లో  ఎంబిఏ జాయిన్​ అయ్యా.  ఆ టైంలోనే  హౌస్​ వైవ్స్​​  కోసం ఈ​ కోర్సుల​ ఐడియా తట్టింది. అప్పట్నుంచే కోర్సుల డిజైనింగ్​ మొదలుపెట్టా. చదువు పూర్తయ్యాక ఇక్కడికొచ్చి ఎక్స్​పీరియెన్స్​ కోసం మా ఫ్యామిలీ బిజినెస్​ ‘హ్యామ్స్​టెక్’​లో పనిచేశా. హ్యామ్స్​టెక్​లో ఆన్​లైన్​ కోర్స్​లు కూడా ఉండేవి. ఆ కోర్సులను హౌస్​వైవ్స్​ కు మరింత అందుబాటులోకి తెచ్చేందుకు  హునార్​ ఆన్​లైన్​ కోర్సుల యాప్​ని రెండేళ్ల క్రితం స్టార్ట్​ చేశా.

ఈ కాన్సెప్టే ఎందుకంటే..

మన దేశంలో దాదాపు 20 కోట్లమంది​ హౌస్​వైవ్స్​​ కి డిగ్రీ పట్టాలున్నాయి. కానీ, వాళ్లలో పద్నాలుగు కోట్లమంది​ ఆడవాళ్లు ఉద్యోగం చేయట్లేదు. కుటుంబ బాధ్యతలు,  ఫ్యామిలీ ఒత్తిడి, పిల్లల బాగోగులు ఇలా కారణమేదైతేనేం వంటగదికే పరిమతమవుతున్నారు. మామూలుగా గర్ల్​ చైల్డ్​ని,  పేద, మధ్య తరగతి మహిళల్ని ఎడ్యుకేట్​ చేయడానికి, వాళ్లకి అవేర్​నెస్​ కల్పించడానికి చాలామంది చొరవ తీసుకుంటున్నారు. ప్రభుత్వాలు కూడా స్పెషల్​ స్కీమ్స్​ పెట్టి వాళ్లని ఎంకరేజ్​ చేస్తున్నాయి. కానీ, హౌస్​వైవ్స్​​ కి మాత్రం అలాంటి సపోర్ట్​ ఒక్కటీ కనిపించట్లేదు. విమెన్​ ఎంపవర్​మెంట్​ పెరగాలంటే ముందు కాన్సన్​ట్రేట్​ చేయాల్సిందే హౌస్​వైవ్స్​​ పైనే. అందుకే ఇల్లాల్ల కోసం ఈ కాన్సెప్ట్​ని తీసుకొచ్చా. హౌస్​ వైవ్స్​​  లైఫ్​ ఎంత బిజీగా ఉంటుందో అందరికీ తెలిసిందే. అందుకే వాళ్లు ఇంటినుంచే తమకి నచ్చిన కోర్సుని ఖాళీ టైం దొరికినప్పుడు  నేర్చుకునేందుకు ఆన్​లైన్​ కాన్సెప్ట్​ ఎంచుకున్నా.

ముప్పైకి పైగా కోర్సులు

గూగుల్​ ప్లే స్టోర్​లో ‘హునార్​ ఆన్​లైన్​ కోర్సెస్’ యాప్​ని డౌన్​లోడ్​  చేసుకుంటే ముప్పైకి పైగా కోర్సులకి సంబంధించిన వీడియోలు చూడొచ్చు. జువెలరీ మేకింగ్​, ఫ్యాషన్​ డిజైనింగ్, ఎంబ్రాయిడరీ, ఫ్యాబ్రిక్​ డిజైనింగ్, బ్యాగ్​ తయారీ, హోం డెకర్​కి సంబంధించిన వీడియోలు వేలల్లో కనిపిస్తాయి. ఈ యాప్​ డౌన్​లోడ్​ చేసుకున్నాక నచ్చిన సబ్జెక్ట్​ ఎంచుకుని నేర్చుకోవడం మొదలు పెట్టొచ్చు. ప్రతి రెండు మూడు వీడియో చాప్టర్స్​​ తర్వాత  ​ ఓ అసైన్​మెంట్​ సబ్మిట్​ చేయాలి. కోర్సంతా పూర్తయ్యేవరకు అంటే ఐదారు నెలల పాటు ఈ ప్రాసెస్​ కంటిన్యూ అవుతుంది. అన్నీ అసైన్​మెంట్స్​లో బెస్ట్​గా పెర్ఫార్మ్​ చేసినవాళ్లందరికీ  నేషనల్​ స్కిల్​ డెవలప్​మెంట్​ కార్పొరేషన్​ నుంచి సర్టిఫికెట్​ ఇస్తాం.

కాల్ చేయొచ్చు..

లెర్నింగ్​ ప్రాసెస్​లో ఏ మాత్రం  డౌట్​ వచ్చినా హౌస్​వైవ్స్​​ మా వాట్సాప్​ నెంబర్​కి​  వీడియో కాల్​ చేయొచ్చు. డౌట్స్​ క్లారిఫికేషన్​ కోసం మా టీమ్​లో 110 మంది ఎక్స్​పర్ట్స్​  అందుబాటులో  ఉంటారు. 2018 లో లాంచ్​ అయిన  హునార్​ ఆన్​లైన్​ కోర్సెస్​ యాప్​కి​ ఇప్పటివరకు 5.5 లక్షల డౌన్​లోడ్స్​ వచ్చాయి.. మా యాప్​ ద్వారా  ఈ రెండేళ్లలో దేశవ్యాప్తంగా 6,500 మంది హౌస్​ వైవ్స్​​  క్రియేటివ్​ స్కిల్స్​ నేర్చుకున్నారు. మా దగ్గర నేర్చుకుని సొంతంగా బిజినెస్​ స్టార్ట్​ చేసినవాళ్లు కూడా ఉన్నారు.  ప్రస్తుతానికి తెలుగు, హిందీ, ఇంగ్లీష్​ భాషల్లో మా కోర్సులు అందుబాటులో ఉన్నాయి. కోర్సుకి 8,000 రూపాయల్ని ఛార్జ్​ చేస్తున్నాం. ఆ అమౌంట్​ని కూడా ఒకేసారి కాకుండా ఇన్​స్టాల్​మెంట్​లో కోర్సు పూర్తయ్యే లోపు కట్టుకోవచ్చు.  కొన్ని ఫ్రీ కోర్సులు కూడా మా యాప్​లో అందుబాటులో ఉన్నాయి.

ఆ ఆలోచనలో ఉన్నా

హునార్​లో క్లాసెస్​ వినాలంటే  స్మార్ట్​ ఫోన్​ కంపల్సరీ.. అలాగే ఇంటర్నెట్​ సదుపాయం కూడా అందుబాటులో ఉండాలి.ఈ రెండింటిని కొందరు​ ఎఫర్ట్​ చేయలేకపోవచ్చు. మరీ ముఖ్యంగా పల్లెటూళ్లకి మా యాప్​ని తీసుకెళ్లడం కష్టమవుతుంది. అందుకే ఇంటర్నెట్​ అందుబాటులో లేని ప్రతి ఊళ్లో ఫ్రీగా ఓ ఇంటర్​నెట్​ సెంటర్​ పెట్టే ఆలోచనలో ఉన్నా. అది చేయగలిగితే ప్రతి హౌస్​వైవ్​  హునార్​ ఆన్ ​లైన్​ కోర్సులని చేరుకోగలుగుతుంది. అలాగే భవిష్యత్తుల్లో మరిన్ని కోర్సుల్ని యాప్​లో అందుబాటులో ఉంచే ఆలోచనలో ఉన్నా.

కన్విన్సింగ్​ కష్టమైంది

ఆన్​లైన్​ ద్వారా క్రియేటివ్​ కోర్సులంటే మొదట్లో అందరూ  ఆశ్చర్యపోయారు. ఇది  సాధ్యం కాదని చాలామంది చేరలేదు. దాంతో జనాల్ని కన్విన్స్​ ​ చేయడం చాలా కష్టమైంది మాకు. యాప్​లో వాళ్లేం చెప్తారో.. మనకేం అర్థమవుతుందోననే అనుమానాల్ని దూరం చేయడానికి చాలా కష్ట పడ్డాం. ఆ కష్టమే ఈ రోజు లక్షల డౌన్​లోడ్స్ అయ్యేలా చేసింది.​ ప్రస్తుతం​ కేవలం హౌస్​ వైవ్సే కాదు ఏజ్​ గ్రూప్​తో సంబంధం లేకుండా అందరూ మా ఆన్​లైన్​  క్లాసెస్​కి అటెండ్​ అవుతున్నారు.  వాళ్లలో స్టూడెంట్​తో పాటు డాక్టర్స్​, టీచర్స్​ లాంటి ప్రొఫెషన్స్​లో గుర్తింపు పొందినవాళ్లు కూడా ఉన్నారు. -ఆవుల యమున