పెళ్లి కూతురి డ్యాన్స్కు నెటిజన్స్ ఫిదా

పెళ్లి కూతురి డ్యాన్స్కు నెటిజన్స్ ఫిదా

న్యూఢిల్లీ: పెళ్లిలో వధూవరులు డ్యాన్సులు చేయడం కామన్ గా మారింది. ఇలాంటి వీడియోలు నెట్ లో కూడా వైరల్ అవుతుంటాయి. బుల్లెట్ బండి పాటకు కొత్త పెళ్లి జంట వేసిన స్టెప్పులు ఎంత పాపులర్ గా మారిందో తెలిసిందే. ఇప్పుడు అలాంటి మరో వీడియో వైరల్ గా మారింది. సౌ ఆస్మాన్ అనే హిందీ పాటకు వధువు చేసిన డ్యాన్ నెట్టింట్లో హల్ చల్ గా మారింది. పెళ్లి మండపానికి తీసుకెళ్తుండగా.. వధువును తన కుటుంబసభ్యులతో కలసి డ్యాన్స్ చేసింది. ఈ వీడియో ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. గురుగ్రామ్ కు చెందిన క్రియేటివ్ డైరెక్టర్ సబా కపూర్ పెళ్లి వీడియో నెల రోజుల తర్వాత నెటిజన్లను ఆకర్షిస్తోంది. సర్ ప్రైజ్ బ్రైడ్ ఎంట్రీ అనే పేరుతో YSDC వెడ్డింగ్ కొరియోగ్రఫీ ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేశారు.

గత నెలలో ఇన్ స్టా లో పోస్టు చేసిన ఈ వీడియోను ఇప్పటి వరకు 2 లక్షల మంది వీక్షించారు. తన పెళ్లిలో ఇది రీ క్రియేట్ చేయకపోతే.. సాడ్ బ్రౌన్ గర్ల్ గా చనిపోతానని.. ఒక వ్యక్తి ఈ వీడియోను ట్విట్టర్ లో పోస్టు చేశారు. దాంతో ఈ వీడియో మరింత వైరల్ గా మారింది. ట్విట్టర్ లో ఇప్పటి వరకు 6.7 లక్షల మంది దీన్ని వీక్షించారు.

మరిన్ని వార్తల కోసం: 

ఎముకలు కొరికే చలిలో జవాన్ల గస్తీ

వనమా రాఘవకు 14 రోజుల కస్టడీ

ఆర్జీవీని చర్చలకు ఆహ్వానించిన పేర్ని నాని