ఆర్జీవీని చర్చలకు ఆహ్వానించిన పేర్ని నాని

ఆర్జీవీని చర్చలకు ఆహ్వానించిన పేర్ని నాని

హైదరాబాద్: సినిమా టికెట్‌ రేట్ల వ్యవహారంపై చర్చించేందుకు రావాల్సిందిగా మంత్రి పేర్ని నాని నుంచి సినీ దర్శకుడు రామ్‌ గోపాల్ వర్మకు పిలుపు వచ్చింది. ఈ నెల 10న మధ్యాహ్నం అమరావతిలోని సచివాలయంలో ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరు కావల్సిందిగా వర్మకు ఆహ్వానం అందింది. ఈ విషయాన్ని వర్మ తన ట్విట్టర్‌ అకౌంట్ ద్వారా వెల్లడించారు. ‘మంత్రి పేర్ని నాని నుంచి పిలుపొచ్చింది. సినిమా టికెట్ల వ్యవహారంలో అభిప్రాయాలు పంచుకోవడానికి ఆహ్వానం అందింది. ఈ అవకాశం కల్పించినందుకు మంత్రికి కృతజ్ఞతలు’ అని ఆర్జీవీ ట్వీట్‌ చేశారు. 

ఇకపోతే, ఏపీలో టికెట్‌ ధరలు తగ్గించడంపై వర్మ స్పందిస్తూ జగన్‌ ప్రభుత్వం, మంత్రుల తీరుపై ఆర్జీవీ ఘాటైన విమర్శలు చేశారు. పది ప్రశ్నలు సంధిస్తూ వాటికి సమాధానం చెప్పాలని  కోరుతూ ఓ వీడియోను విడుదల చేశారు. సర్కారుతో ఎప్పుడైనా, ఎక్కడైనా చర్చకు సిద్ధమేనని సవాల్‌ విసిరారు. ప్రభుత్వంతో గొడవ పడటం తన ఉద్దేశం కాదని, అవకాశం ఇస్తే కలుస్తానని వర్మ పేర్కొన్నారు. దీనిపై మంత్రి నాని కూడా ప్రతిస్పందిస్తూ.. ‘త్వరలో కలుద్దాం’ అని ట్వీట్‌ చేశారు. ఈ నేపథ్యంలో వర్మతో చర్చలు జరిపేందుకు మంత్రి సమయాన్ని కేటాయించారు. సినిమా టికెట్‌ రేట్లపై ఘాటైన విమర్శలు చేసిన వర్మతో మంత్రి చర్చల నేపథ్యంలో ఈ వ్యవహారంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

మరిన్ని వార్తల కోసం: 

కేసీఆర్‎ను విమర్శించే హక్కు శివరాజ్ సింగ్‎కు లేదు

ఎన్నికల్లో అక్క పోటీ చేస్తోందని సోనూ కీలక నిర్ణయం

రాఘవ కోసం 8 బృందాలను ఫామ్ చేసి పట్టుకున్నాం