
న్యూఢిల్లీ: బీఎస్ఎన్ఎల్ రూ. 151తో కొత్త బీఐటీవీ ప్రీమియం ప్యాక్‌ను ప్రారంభించింది. ఈ ప్లాన్ ద్వారా వినియోగదారులు ఒకే యాప్‌లో 25కి పైగా ఓటీటీ యాప్స్, 450కి పైగా లైవ్ టీవీ ఛానెళ్లను చూడవచ్చు.
సోనీలివ్, జీ5, సన్ నెక్స్ట్, లయన్స్‌గేట్ ప్లే, ఈటీవీ విన్, ఆహా, డిస్కవరీ, ఎపిక్ ఆన్, షెమారూ, చౌపాల్ లాంటి 25కు పైగా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లను చూడవచ్చు. ఈ ప్లాన్‌లో డేటా, ఎస్ఎంఎస్ లేదా కాలింగ్ ప్రయోజనాలు ఉండవు.