ఇస్రో చరిత్రలో ఈ ప్రయోగం ఎంతో చారిత్రాత్మకమైనది : శివన్

ఇస్రో చరిత్రలో ఈ ప్రయోగం ఎంతో చారిత్రాత్మకమైనది : శివన్

తిరుమల : ఇస్రో చరిత్రలో PSLV C-48 ప్రయోగం ఎంతో చారిత్రాత్మకమైన ప్రయోగమన్నారు ఇస్రో చైర్మన్ శివన్. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న శివన్.. PSLV కి ఇది 50వ ప్రయోగమని చెప్పారు.

శ్రీహరికోట నుంచి 75వ ప్రయోగమన్నారు. రేపు మధ్యాహ్నం ప్రయోగించనున్న PSLV C-48కు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామన్నారు. ఇవాళ మధ్యాహ్నం నుంచి కౌంట్ డౌన్  ప్రారంభం అవుతుందన్నారు.