Manchu Manoj : ఇది బ్రిటీష్ ఇండియా కాదు.. 'డేవిడ్ రెడ్డి' ఇండియా.. మనోజ్ పవర్‌ఫుల్ కమ్‌బ్యాక్!

Manchu Manoj : ఇది బ్రిటీష్ ఇండియా కాదు.. 'డేవిడ్ రెడ్డి' ఇండియా.. మనోజ్ పవర్‌ఫుల్ కమ్‌బ్యాక్!

టాలీవుడ్ రాకింగ్ స్టార్ మంచు మనోజ్ వెండితెరపై మళ్ళీ తన విశ్వరూపం చూపించడానికి సిద్ధమయ్యారు. ఆయన హీరోగా నటిస్తున్న భారీ పీరియాడికల్ యాక్షన్ డ్రామా 'డేవిడ్ రెడ్డి' (David Reddy). హనుమరెడ్డి యక్కంటి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా గ్లింప్స్‌ను బుధవారం ఘనంగా విడుదల చేశారు. ఈ వీడియో చూస్తుంటే మనోజ్ ఒక పవర్‌ఫుల్ పీరియాడిక్ రోల్‌తో బాక్సాఫీస్‌ను షేక్ చేయడం ఖాయమనిపిస్తోంది.

 'డేవిడ్ రెడ్డి' ఇండియా!

ఈ గ్లింప్స్ సినిమా నేపథ్యాన్ని, డేవిడ్ రెడ్డి పాత్ర స్వభావాన్ని కళ్ళకు కట్టినట్లు చూపించింది. ముఖ్యంగా బ్యాక్‌గ్రౌండ్‌లో వినిపించే డైలాగులు ఆకట్టుకుంటున్నాయి. "అతను బ్రిటీషర్లకూ శత్రువే.. ఇండియన్స్‌కీ శత్రువే.. పాతిక కోట్ల మంది కోపం వాడొక్కడి రక్తంలో నిండింది. మనల్ని ఇండియన్ డాగ్స్ అనే బ్రిటీషర్లకు అతను వార్ డాగ్ అయ్యాడు.  మనోజ్ తన గంభీరమైన గొంతుతో "ఏ బ్రిటీష్ ఇండియా నహీ హై.. ఏ డేవిడ్ రెడ్డి ఇండియా హై" అని చెప్పిన డైలాగ్ హైలైట్‌గా నిలిచింది. మనోజ్ స్క్రీన్ ప్రెజెన్స్, విజువల్స్ , ఉత్కంఠ రేకెత్తించే సంగీతం సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేశాయి.

 

రామ్ చరణ్ అతిథి పాత్రపై క్లారిటీ

గత కొద్ది రోజులుగా ఈ సినిమాలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఒక కీలకమైన అతిథి పాత్రలో కనిపిస్తారంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. గ్లింప్స్ లాంచ్ ఈవెంట్‌లో మనోజ్ దీనిపై స్పందించారు. సినిమాలో గెస్ట్ రోల్స్‌కు మంచి స్కోప్ ఉంది, కానీ ఇప్పటివరకు మేము ఎవరినీ సంప్రదించలేదు అని స్పష్టం చేస్తూనే, భవిష్యత్తులో సర్ప్రైజ్‌లు ఉండే అవకాశం ఉందనే హింట్ ఇచ్చారు.

సెకండ్ ఇన్నింగ్స్‌లో దూకుడు


మనోజ్ ఇటీవల 'మిరాయ్' చిత్రంలో విలన్‌గా నటించి మెప్పించారు. అయితే హీరోగా ఆయనకు ఇది చాలా కీలకమైన సినిమా. భరత్ మోటుకూరి, వెంకట రెడ్డి నల్లగంగుల నిర్మిస్తున్న ఈ చిత్రంలో దేశభక్తి అంశాలతో పాటు హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ ఉండబోతున్నాయి. మంచు అభిమానులు ఆశించిన పక్కా మాస్ అండ్ ఎమోషనల్ ఎలిమెంట్స్‌తో ఈ 'వార్ డాగ్' థియేటర్లలో సందడి చేయబోతున్నాడు.