
టాలీవుడ్ హీరో, 'మా' అధ్యక్షుడు మంచు విష్ణు ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. తన చిత్రాలకు సంబంధించిన విషయాలు.. ఇతరత్రా పోస్టులు చేస్తుంటారు. తాజాగా ఆయన చేసిన పోస్టు తెగ వైరల్ కాగా.. నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు. ఆయన పోస్టు చేసింది ‘దున్నపోతు’ ఫొటో. ‘నేను పది పుష్ అప్స్ లు చేసిన తర్వాత నేను ఇలా ఉంటానని ఊహించుకుంటాను’ అని క్యాప్షన్ చేస్తూ ట్వీట్ చేశారు. ఫొటోలో దున్నపోతు బాగా బలంగా ఉంది. నెటిజన్లు నెగటివ్ కామెంట్స్ చేస్తున్నారు. ఇతర ఫొటోలు, మీమ్స్ పోస్టులు చేస్తుండడంతో వైరల్ గా మారింది.
ప్రస్తుతం మంచు విష్ణు జిన్నా చిత్రంలో నటిస్తున్నాడు. పాయల్ రాజ్ పుత్, సన్నీ లియోన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. సూర్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాను 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, అవా ఎంటర్ టైన్ మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. తెలుగుతో పాటు తమిళం, హిందీ, మలయాళం భాషల్లో రూపొందిస్తున్నారు. అక్టోబర్ నెలలో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశముంది.
This is how I imagine I am after I do ten push ups. ? pic.twitter.com/YvqadZBZtH
— Vishnu Manchu (@iVishnuManchu) September 17, 2022