ఇదే నేను చేసే చివరి లవ్‌‌ స్టోరీ

ఇదే నేను చేసే చివరి లవ్‌‌ స్టోరీ

దుల్కర్ సల్మాన్, మృణాళ్ ఠాకూర్ జంటగా హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘సీతారామం’. సుమంత్, రష్మిక, భూమిక కీలక పాత్రలు పోషించారు. అశ్వినీదత్ నిర్మించారు. ఆగస్టు 5న సినిమా విడుదల కానుంది. నిన్న ట్రైలర్‌‌‌‌ను లాంచ్ చేశారు. ఈ సందర్భంగా దుల్కర్ మాట్లాడుతూ ‘రొమాంటిక్ హీరోగా నటించడం విసుగొచ్చి ఇక అలాంటి సినిమాలు ఆపేద్దామనుకున్నా. కానీ హను చెప్పిన ఈ అందమైన ప్రేమకథ నచ్చింది. ఇదే నేను చేసే చివరి లవ్‌‌ స్టోరీ. కశ్మీర్, స్మృతి వ్యాలీ లాంటి ప్రాంతాల్ని ఫస్ట్ టైమ్ చూశా. అక్కడ షూటింగ్ చేయడం కష్టమైనా స్టోరీపై ఉన్న నమ్మకంతో అందరం హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్‌‌ పెట్టాం. సినిమా అందరికీ కచ్చితంగా నచ్చుతుంది’ అన్నాడు. రష్మిక మాట్లాడుతూ ‘రామ్, సీతల బ్యూటిఫుల్‌‌ లవ్‌‌స్టోరీని చెప్పే పాత్ర నాది. చాలా రెబల్ క్యారెక్టర్. నేను న్యాయం చేయగలనా అనిపించింది. మీకు నచ్చుతుందని ఆశిస్తున్నా’ అంది. ‘కథ వినగానే సీతామహాలక్ష్మి పాత్రతో ప్రేమలో పడ్డా. అంతలా నచ్చింది. రొమాన్స్‌‌ అందరినీ ఇంప్రెస్‌‌ చేయబోతోంది’ అంది మృణాల్. సుమంత్ మాట్లాడుతూ ‘స్క్రిప్ట్ చదివాక ఇదో దృశ్యకావ్యంలా అనిపించింది. ‘గోదావరి’ సినిమాలో రామ్, సీతామహాలక్ష్మిల లవ్‌‌ స్టోరీ ఎలా క్లాసిక్‌‌గా నిలిచిందో, ఈ సినిమా కూడా అలాంటి క్లాసిక్‌‌ అవుతుందని నమ్ముతున్నా’ అన్నాడు. ‘వర్షం వేళలో వేడి కాఫీ తాగుతున్నపుడు, మండు వేసవిలో చల్లని నీళ్లు తాగుతున్నప్పుడు కలిగే ఫీల్‌‌ని ఈ సినిమా అందిస్తుంది. ప్రేక్షకులు తమను తాము మర్చిపోయి.. రామ్, సీత పాత్రల్లో లీనమవుతారు. ఇంటికెళ్లాక కూడా కొద్ది రోజుల పాటు ప్రేక్షకుల్ని వెంటాడుతుందీ సినిమా’ అన్నాడు హను. ‘కొవిడ్‌‌ టైమ్‌‌లో రిస్క్ చేసి కశ్మీర్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, రష్యా ప్రాంతాల్లో షూటింగ్ చేశాం. ప్రేక్షకులు మంచి సక్సెస్ ఇస్తారనే నమ్మకముంది’ అన్నారు అశ్వినీదత్.