
ఇది పాత భారత్ కాదు.. కొత్త భారత్.. ఎప్పుడేం చేయాలో సైన్యం నిర్ణయిస్తుందని ప్రధాని మోదీ అన్నారు. పాకిస్తాన్ కుట్రలు ఇక చెల్లవని.. న్యూక్లియర్ బాంబులకు బయపడేది లేదని తెగేసి చెప్పారు. దేశవ్యాప్తంగా రీ డెవలప్ చేసిన103 అమృత్ భారత్ రైల్వే స్టేషన్లను రాజస్థాన్ బికనీర్ లో వర్చువల్ గా ప్రారంభించిన మోదీ.. అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో పాకిస్తాన్ పై నిప్పులు చెరిగారు.
పహల్గాం ఉగ్రదాడి 140 కోట్ల భారతీయుల హృదయాలను గాయపరిచిందని ప్రధాని మోదీ అన్నారు. దీనికి ప్రతిగా ఆపరేషన్ సిందూర్ తో ఉగ్రవాదులకు, వారిని ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్ కు చుక్కలు చూపించామని చెప్పారు. కేవలం 23 నిమిషాల్లోనే ఆపరరేషన్ సిందూర్ ముగిసిందని తెలిపారు.
పహల్గాం దాడిలో 26 మంది అమాయకులు చనిపోయారని.. ఉగ్రవాదులకు బుద్ధి చెప్పేందుకు త్రివిధ దళాలకు స్వేచ్ఛనిచ్చినట్లు తెలిపారు. న్యాయానికి ఆపరేషన్ సిందూర్ అని ఈ సందర్భంగా ప్రధాని మోదీ అన్నారు. ఉగ్రవాదులను మట్టిలో కలిపేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. భారత్ పై దాడి చేస్తే ఎలా ఉంటుందో పాకిస్తాన్ కు అర్ధమయ్యిందని తెలిపారు.
Also Read : తెలంగాణలో మూడు అమృత్ రైల్వే స్టేషన్లను వర్చువల్గా ప్రారంభించిన ప్రధాని మోదీ
పాకిస్తాన్ కుట్రలు ఇక నడవవు. భారత్ పైకి పాక్ ఉగ్రవాదులను ఉసిగొల్పుతుందని, వారికి చుక్కలు చూపించిందని ఈ సందర్భంగా తెలలిపారు. పాక్ భారత్ వైపు వచ్చిన ప్రతీసారి భారత్ దే గెలుపు అని ఈ సందర్బంగా చెప్పారు. పాక్ నిజస్వరూపాన్ని ప్రపంచానికి చెప్పాలని ఎంపీలు బయల్దేరారని.. పాక్ నిజస్వరూపాన్ని ప్రపంచానికి చూపిస్తామని మోదీ అన్నారు.
వికసిత్ భారత్ కోసం ఆరు రెట్ల అదనంగా నిధులు కేటాయిస్తున్నాం
వికసిత్ భారత్ కోసం నిధులను ఆరు రెట్లు అధికంగా కేటాయిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. రోడ్లు, రైల్వేలు, ఎయిర్ పోర్టులను ఆదునీకరిస్తున్నామని.. దీనివల్ల దేశంలో టూరిజం పెరుగుతుందని చెప్పారు. అమృత్ భారత్ స్కీం లో భాగంగా అభివృద్ధి చేసిన 103 రైల్వే స్టేషన్లను వర్చువల్ గా పున:ప్రారంభించారు ప్రధాని మోదీ. రాజస్థాన్ బికనీర్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో రెనువేట్ చేసిన స్టేషన్లను ప్రారంభించారు.
దేశంలో తొలి బుల్లెట్ రైలు కోసం అడుగులు పడుతున్నాయని ఈ సందర్భంగా మోదీ తెలిపారు. 2011 తర్వాత దేశ వ్యాప్తంగా 30 వేల కిలోమీటర్లకు పైగా రైల్వే లైన్లు వేయించినట్లు తెలిపారు. వందకు పైగా అమృత్ భారత్ స్టేషన్లు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు.
దేశంలో 70 మార్గాల్లో వందే భారత్ రైళ్లను ప్రవేశపట్టనున్నట్లు తెలిపారు. రైల్వేలు దేశ పర్యాటకాన్ని మెరుగుపరుస్తాయని సందర్భంగా చెప్పారు. దేశంలో మౌళిక వసతులు పెంచుతున్నామని.. దీనికోసం కేటాయించే బడ్జెట్.. ఉద్యోగాల రూపంలో తిరిగి వస్తుందని చెప్పారు.