టూత్​ బ్రష్​లకు ఇది కరెక్ట్ ప్లేస్

V6 Velugu Posted on Jun 22, 2021

టూత్ ​బ్రష్​లను ఎక్కడ పెడుతున్నారు? బాత్​రూంలో? వాష్​బేసిన్​ దగ్గర? అందరి బ్రష్​లూ ఒకే స్టాండ్​లో పెడుతున్నారా? అలాంటప్పుడు వైరస్, బ్యాక్టీరియాలు ఈజీగా స్ర్పెడ్​ అవుతాయి. సో, ఆ ప్రాబ్లమ్​ రాకూడదంటే... ఎప్పటికప్పుడు చేతుల్ని, వాడే వస్తువులను శానిటైజ్​ చేసినట్లే టూత్​బ్రష్​లను కూడా శానిటైజ్​ చేయాలి. అలా చేయాలంటే మామూలు హోల్డర్​లు కాకుండా ఇలాంటి శానిటైజింగ్ హోల్డర్ ఉండాలి. ఇవి టూత్​ బ్రష్​లు పెట్టుకోవడానికి స్పెషల్​గా తయారుచేసిన శానిటైజర్​ హోల్డర్​లు. వీటిలో ఒక్కో బ్రష్​ను  సెపరేట్​గా పెట్టుకోవచ్చు. వీటి నుంచి యువీ–సి అనే లైట్​ వస్తుంది. అది క్రిములను క్షణాల్లో చంపేస్తుంది. వాటినే కాదు కొంచెం పెద్ద కీటకాల్ని కూడా అరగంటలో చంపేస్తుంది ఆ లైటింగ్​. కొన్ని హోల్డర్స్ అయితే పది నిమిషాల్లోనే పని చేసే స్తాయి. వీటిలో చాలా రకాలున్నాయి. ఈ టూత్​బ్రష్​ హోల్డర్​లు అమెజాన్​లో దొరుకుతాయి.

Tagged health, place, life style, , toothbrushes

Latest Videos

Subscribe Now

More News