మొలకెత్తిన ధాన్యానికి ప్రభుత్వానిదే బాధ్యత

మొలకెత్తిన ధాన్యానికి ప్రభుత్వానిదే బాధ్యత

రైతులు నెలరోజుల నుంచి ధాన్యం అమ్ముడుపోక కల్లాల్లోనే ఉంటున్నారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.  తరుగు పేరుతో శ్రమ దోపిడీ ఆగాలని ఆయన అన్నారు. వర్షాలకు తడిసి.. మొలకెత్తిన ధాన్యానికి ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

‘ప్రస్తుతం వానాకాలం పంట కల్లాల్లో ఉంది. నెల రోజులుగా రైతు ఇంటికి పోకుండా కల్లంలో కన్నీరు పెడుతున్నాడు. తక్షణం ధాన్యం కొనాలి. తరుగు పేరుతో శ్రమ దోపిడీ ఆగాలి. తడిసిన ధాన్యం సైతం కొనాలి. మొలకెత్తిన ధాన్యానికి బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి. ఇదే రెండు రోజుల కాంగ్రెస్ “వరిదీక్ష”డిమాండ్’ అని రేవంత్ ట్వీట్ చేశారు.