రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అతి పెద్ద సంక్షోభం ఇదే

రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అతి పెద్ద సంక్షోభం ఇదే

వాషింగ్టన్: రష్యాతో యుద్ధంలో తమకు అమెరికా సహాయం ఇప్పుడు మరింత అవసరమని ఉక్రెయి న్​ ప్రెసిడెంట్ జెలెన్​స్కీ కోరారు. అమెరికన్​ కాంగ్రెస్​ను ఉద్దేశించి బుధవారం వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా మాట్లాడారు. ఈ సందర్భంగా పెరల్​ హార్బర్, 9/11 ఉగ్రవాద దాడి ఘటనలను ఆయన ప్రస్తావించారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత యూరోప్​ ఎదుర్కొంటున్న అతి పెద్ద సంక్షోభం ఇదేనని చెప్పారు. రష్యాను కంట్రోల్​ చేసేందుకు తమ దేశాన్ని నోఫ్లై జోన్​గా ప్రకటించాలని మళ్లీ విజ్ఞప్తి చేశారు. నెత్తురోడుతున్న తమ దేశానికి సాయమందివ్వాలని కోరారు. ఇప్పటివరకు తమకు మద్దతుగా నిలిచిన అమెరికన్ల కు రుణపడి ఉంటామని, అయితే తమకు బైడెన్​ ఆఫీస్​ నుంచి ఇంకా సాయం కావాలని విజ్ఞప్తి చేశారు.