RCB Squad: హేజిల్‌వుడ్‌ ఔట్, వెంకటేష్ అయ్యర్‌కు నో ఛాన్స్.. SRH మ్యాచ్‌కు RCB తుది జట్టు ఇదే!

RCB Squad: హేజిల్‌వుడ్‌ ఔట్, వెంకటేష్ అయ్యర్‌కు నో ఛాన్స్.. SRH మ్యాచ్‌కు RCB తుది జట్టు ఇదే!

RCB Squad: ఐపీఎల్ 2026 సీజన్‌లో డిఫెండింగ్ చాంపియన్ గా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు బరిలోకి దిగబోతుంది. ఈ ఎడిషన్ లో తమ టైటిల్ ని డిఫెన్స్‌ చేసుకునేందుకు ప్లాన్ చేస్తుంది.  మార్చి 28న ప్రారంభం కానున్న తొలి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తో ఎం. చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ తలపడనుంది. కాగా గత సీజన్‌లో టైటిల్ సాధించిన జట్టుని ఆర్సీబీ యాజమాన్యం అలాగే కొనసాగించింది. తక్కువ బడ్జెట్‌తో వేలంలో పాల్గొన్నప్పటికీ టీమ్ ని మరింత బలోపేతం చేసేలా పలు నిర్ణయాలు తీసుకుంది. కెప్టెన్‌గా రజత్ పటిదార్ కే మళ్లీ బాధ్యతలు అప్పగించింది. 2025 సీజన్‌లో గాయంతో ఇబ్బంది పడినప్పటికీ ఈసారి మంచి ప్రదర్శన ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు.

ఓపెనింగ్‌లో ఫిల్ సాల్ట్– విరాట్ కోహ్లీ జోడీ మళ్లీ జట్టుని ముందుండి నడిపించనుంది. గత సీజన్‌లో ఈ జోడీ జట్టుకు అద్భుతమైన ప్రదర్శనలతో టీమ్ విజయాల్లో కీలక పాత్ర పోషించింది. నెంబర్-3లో దేవదత్ పడిక్కల్ స్థానం దాదాపు ఫిక్స్ కావడంతో.. వెంకటేష్ అయ్యర్‌కు స్టార్టింగ్ మ్యాచ్‌లో అవకాశం దక్కకపోవచ్చు. ఇక మిడిల్ ఆర్డర్‌లో టిమ్ డేవిడ్, జితేష్ శర్మ, రోమారియో షెఫర్డ్ కీలక పాత్ర పోషించనున్నారు. అలాగే ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్యా కూడా జట్టులో కీలకంగా మారనున్నాడు. అలాగే బౌలింగ్ విభాగంలో ఆర్సీబీకి కొన్ని సమస్యలు ఎదురవుతున్నాయి. స్టార్ పేసర్ జోష్ హేజిల్‌వుడ్ గాయంతో పలు మ్యాచ్‌లకు దూరమయ్యే అవకాశం కనిపిస్తుంది. అతని స్థానంలో జాకబ్ డఫీ లేదా నువాన్ తుషారా టీమ్ లోకి వచ్చే ఛాన్స్ ఉంది. 

►ALSO READ | Team India: ICC వన్డే ర్యాంకింగ్స్ టీమిండియా కుర్రోళ్లదే హవా : టాప్ 5లో ముగ్గురు మొనగాళ్లు..!

ఇక రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు పేస్ విభాగాన్ని భువనేశ్వర్ కుమార్ నడిపించనున్నాడు. స్పిన్ విభాగంలో సుయాష్ శర్మ కీలక పాత్ర పోషించే ఛాన్స్ ఉంది. యువ ఆటగాళ్లు మంగేష్ యాదవ్, రసీఖ్ సల్మాన్ దార్ కూడా తుద జట్టులో స్థానం కోసం పోటీ పడుతున్నారు. దీంతో గత సీజన్‌లో విజయాన్ని అందించిన ఓపెనింగ్ కాంబినేషన్‌ను కొనసాగిస్తూ, నాలుగు మార్పులతో ఆర్సీబీ కొత్త సీజన్‌కు రెడీ అయింది. టైటిల్ డిఫెన్స్‌లో ఆర్సీబీ ఎలా రాణిస్తుందో వేచి చూడాల్సి ఉంది. 

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు అంచనా: 
ఆర్సీబీ జట్టు: ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్, రజత్ పటిదార్(కెప్టెన్), టిమ్ డేవిడ్, జితేష్ శర్మ, రోమారియో షెఫర్డ్, కృనాల్ పాండ్యా, జాకబ్ డఫీ, భువనేశ్వర్ కుమార్, సుయాష్ శర్మ.