అయోధ్య‌లో ప్ర‌ధాని మోడీ షెడ్యూల్ ఇదే..!

అయోధ్య‌లో ప్ర‌ధాని మోడీ షెడ్యూల్ ఇదే..!

అయోధ్య రామ మందిర పూజ కోసం రానున్న ప్రధాని నరేంద్రమోడీ సుమారు మూడు గంటల పాటు ఆధ్యాత్మిక నగరంలో గడపనున్నారు. 40 కిలోల వెండి ఇటుకతో ప్రధాని నరేంద్రమోడీ భూమి పూజ చేయనున్నారు. దీనిని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ చైర్మన్ మహంత్ నృత్య గోపాల్ దాస్ డొనేట్ చేశారు. భూమి పూజ అనంతరం ఈ
ఇటుకను తీసి భద్రపరుస్తా రు.
-బుధవారం ఉదయం 9.35 గంటలకు ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి ప్రధాని మోడీ బయలుదేరి
10.35కి లక్నో చేరుకుంటారు.
-అక్కడి నుంచి 10.40కి బయలుదేరి హెలికాఫ్టర్లో అయోధ్యకు వెళతారు.
సరయూ నదీ తీరంలో సాకేత్ కాలేజ్ క్యాంప‌స్ లో ఏర్పాటు చేసిన హెలీ ప్యాడ్ దగ్గర 11.30కి చాపర్
ల్యాండ్ అవుతుంది.
-తొలుత సరయూ నదీ ఒడ్డు న ఉన్న హనుమాన్ గర్హి టెంపుల్కు వెళ్లి దేవుడిని దర్శించుకుంటారు.
-అక్కడి నుంచి 12 గంటల సమయంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తో కలిసి రామ జన్మభూమి
కాంప్లెక్స్ కు చేరుకుంటారు.
-అక్కడి రాముడి విగ్రహాన్ని(రామ్ లల్లా) దర్శించుకుని ఆలయ పరిసరాల్లోపారిజాత మొక్కను నాటుతారు.
-అక్కడి నుంచి భూమి పూజ జరిగే స్టేజ్ కు చేరుకుంటారు.
మధ్యాహ్నం 12.30 గంటలకు పూజ స్టార్ట్ 12.40 గంటలకు 40 కేజీల వెండి ఇటుకతో మందిరం నిర్మాణాన్ని మోడీ ప్రారంభిస్తా రు.
-2.05 నిమిషాలకు సాకేత్ కాలేజ్ కు బయలుదేరుతారు.
-అక్కడి నుంచి 2.20 నిమిషాలకు హెలికాప్టర్ లో లక్నో వెళతారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం