
ప్రమాదాలు చెప్పిరావు అంటే ఇదేనేమో..సరదాగా ఈత కొడదామని వెళ్లిన వ్యక్తికి అనుకోని సంఘటన ఎదురైంది. రెప్పపాటు కాలంలో జరిగిన ఊహించని పరిణామం అతని భవిష్యత్ ఒక్కసారిగా తలకిందులైంది. ఆ సీన్ చూస్తుంటే.. ఒక్కసారిగా ఒళ్లు గగుర్పొడుస్తుంది. అనుకోని పరిస్థితులు అతన్ని ఆస్పత్రి పాలు చేశాయి. ప్రాణానికి ప్రమాదం లేకపోయినప్పటికీ భవిషత్తును మాత్రం అంధకారంలోకి నెట్టింది.
Bro ? pic.twitter.com/WKXhnvyl73
— The Instigator (@Am_Blujay) July 27, 2024
ఈత కొడదామని వెళ్లిన ఆ వ్యక్తి నీళ్లలోకి జంప్ చేసేందుకు ప్రయత్నించగా.. కాలు స్లిప్ అయి.. స్టాండ్కు చిక్కుకొని కిందకు వేలాడుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఎక్కడ జరిగిందో స్పష్టంగా తెలియదు గానీ.. ఈ వీడియో చూసిన ప్రతిఒక్కరూ.. అయ్యో పాపం.. అనుకోని సంఘటన ఆ వ్యక్తి జీవితాన్ని అయోమయంలో పడేసింది..భవిష్యత్ ను గందరగోళంలో పడేసిందని సానుభూతి చూపిస్తున్నారు.