విశ్వక్ కెరీర్‌‌‌‌లో ఇది మైల్ స్టోన్ మూవీ : నివేదా పేతురాజ్

విశ్వక్ కెరీర్‌‌‌‌లో ఇది మైల్ స్టోన్ మూవీ : నివేదా పేతురాజ్

‘పాగల్’ మూవీ తర్వాత విశ్వక్ సేన్, నివేదా పేతురాజ్ మరోసారి కలిసి నటించిన చిత్రం ‘దాస్ కా ధమ్కీ’.  విశ్వక్ డైరెక్ట్ చేయగా,  ఆయన తండ్రి కరాటే రాజు నిర్మించారు. మార్చి 22న సినిమా విడుదలవుతున్న సందర్భంగా నివేదా పేతురాజ్ మాట్లాడుతూ..   ‘విశ్వక్‌‌తో ‘పాగల్’ చేస్తున్నప్పుడే ‘ఓరి దేవుడా’లో ఆఫర్ వచ్చింది.  కానీ ఆ పాత్ర నాకు సెట్ కాదనిపించింది.  తర్వాత ఈ స్క్రిప్ట్ విన్నాను. చాలా నచ్చింది. ఇదొక యూనిక్ స్టోరీ. విశ్వక్ దర్శకత్వం వహించడం మరింత స్పెషల్‌‌.  ఇందులో నాది చాలా గ్లామరస్ రోల్. కెరీర్‌‌‌‌లో మొదటిసారి ఇలాంటి పాత్ర చేశా. డ్యాన్సులు చేయడం కొత్తగా అనిపించింది.  

కథతో పాటు రావు రమేష్, రోహిణి పర్ఫార్మెన్స్, లియోన్ జేమ్స్ మ్యూజిక్ సినిమాకు ప్లస్ అవుతాయి.  విశ్వక్ కెరీర్‌‌‌‌లో ఇది మైల్ స్టోన్ మూవీ అవుతుంది. హీరోగా, దర్శకుడిగా, నిర్మాతగా మూడు బాధ్యతలకు విశ్వక్ పూర్తి న్యాయం చేశాడు. నేను వర్క్ చేసిన డైరెక్టర్స్‌‌లో త్రివిక్రమ్ తర్వాత అంతటి ఎనర్జీ విశ్వక్‌‌లో చూశా. అలాగే లోకేష్ కనకరాజ్ లాంటి మాస్‌‌ టచ్ తనలో ఉంది. అయితే వేరే హీరోలని డైరెక్ట్ చేస్తే ఇంకా బాగుంటుందని నా ఫీలింగ్.  బాలకృష్ణ గారి లాంటి పెద్ద మాస్ హీరోలని కూడా  డైరెక్ట్ చేసే సత్తా విశ్వక్‌‌లో ఉంది.  ఇక సుస్మిత గారి నిర్మాణంలో నేను నటిస్తున్న చిత్రం షూటింగ్ పూర్తయింది. అలాగే  హిందీలో టీ సిరీస్‌‌ నిర్మిస్తున్న ఓ చిత్రంలో నటిస్తున్నా.  నటనతో పాటు బిజినెస్‌‌పై కూడా దృష్టి పెట్టా.  చెన్నైలో  ఇప్పటికే ఓ రెస్టారెంట్ ప్రారంభించా’ అని చెప్పింది.