తాలిబన్ల భయంతో ఒకే ఫ్లైట్‌లో 640 మంది..

V6 Velugu Posted on Aug 17, 2021

కాబూల్: అఫ్గానిస్థాన్ ను తాలిబన్లు స్వాధీనం చేసుకున్నారు. రాజధాని కాబూల్ ను తమ చేతిలో తీసుకున్నారు. దీంతో తాలిబన్ల పాలనను తలచుకుని ప్రజలు భయపడుతున్నారు. వేలాది మంది శరణార్థులు ఇతర దేశాలకు వలస పోతున్నారు. ఇలా వెళ్తున్న వారి దుస్థితికి అద్దం పట్టేలా ఉన్న ఓ ఫొటో అందరి మనసుల్ని కలచి వేస్తోంది. కాబూల్ నుంచి వెళ్తున్న ఒక విమానంలో వందలాది మంది ప్రయాణించిన ఒక ఫొటో వైరల్ అవుతోంది. దాదాపు 640 మంది ప్రయాణికులు సీ17 గ్లోబ్ మాస్టర్ అనే ఫ్లైట్ లో వెళ్లారని యూఎస్ కు చెందిన డిఫెన్స్ వన్ అనే సైట్ తెలిపింది. వీళ్లంతా సురక్షితంగా ఖతర్ లో ల్యాండ్ అయ్యారని డిఫెన్స్ వన్ పేర్కొంది.

Tagged Afghanistan, Talibans, Kabul, Ashraf Ghani, Afghans, Globe Master, Khatar

Latest Videos

Subscribe Now

More News