ధూమ్ ధామ్ దోస్తాన్

ధూమ్ ధామ్ దోస్తాన్

ఫ్రెండ్‌‌‌‌షిప్‌‌‌‌ డే అనగానే ఫ్రెండ్స్ అంతా ఒకదగ్గర చేరి ఎంజాయ్ చేస్తుంటారు. నాని కూడా నిన్న  ఫ్రెండ్‌‌‌‌షిప్ డే సందర్భంగా తన స్నేహితులందరితో కలిసి సరదాగా ఎంజాయ్ చేశాడు. కాకపోతే వాళ్లంతా రియల్ ఫ్రెండ్స్ కాదు.. రీల్ ఫ్రెండ్స్. తను హీరోగా నటిస్తున్న ‘దసరా’ మూవీ టీమ్‌‌‌‌ నుంచి అతని గ్యాంగ్‌‌‌‌తో ఉన్న పోస్టర్‌‌‌‌‌‌‌‌ను విడుదల చేశారు మేకర్స్. ఇందులో నాని అండ్ బ్యాచ్ సరదాగా నవ్వుతూ కనిపించారు. అందరి ముఖంలో గొప్ప సంతోషం కనిపిస్తున్న ఈ పోస్టర్ ఫ్రెండ్‌‌‌‌షిప్ డే కి పర్ఫెక్ట్ ట్రీట్‌‌‌‌గా నిలిచింది.

దీన్ని నాని ట్విటర్‌‌‌‌‌‌‌‌లో పోస్ట్ చేస్తూ ‘ధూమ్ ధామ్ దోస్తాన్.. ఇరగ మరగ చేద్దాం’ అంటూ ట్వీట్ చేశాడు. బొగ్గుగనుల బ్యాక్‌‌‌‌డ్రాప్‌‌‌‌లో శ్రీకాంత్ ఓదెల ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. ప్రస్తుతం గోదావరిఖనిలో షూటింగ్ జరుగుతుండగా నానికి తృటిలో ప్రమాదం తప్పింది. బొగ్గు ట్రక్కు కింద షూటింగ్ చేస్తుంటే ఒక్కసారిగా బొగ్గు నానిపై పడిందట. అయితే చిత్ర యూనిట్ వెంటనే స్పందించడంతో స్వల్ప గాయాలతో బయటపడినట్టు తెలుస్తోంది.  నాని జంటగా కీర్తి సురేష్ నటిస్తోంది. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నాడు.  తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో  రిలీజ్ చేయనున్నారు.