ఓరి దేవుడా.. ఆవుకు రూ.40 కోట్లా.. రికార్డ్ సృష్టించిన నెల్లూర్ జాతి ఆవు

ఓరి  దేవుడా.. ఆవుకు రూ.40 కోట్లా.. రికార్డ్ సృష్టించిన నెల్లూర్ జాతి ఆవు

ప్రపంచ వ్యాప్తంగా ఆంధ్ర ప్రదేశ్ లోని నెల్లురు జిల్లా ఒంగోలు ప్రాంతానికి చెందిన ఆవులు చాలా ఫేమస్.  నెల్లూరు జాతీ ఆవులకు అంతర్జాతీయ పశువుల మార్కెట్‌లో విశిష్ట ప్రాధాన్యత ఉంది. నెల్లూరు జాతి ఆవులు అన్ని రకాల ఉష్టోగ్రతలను తట్టుకొని జీవించగల సామర్థ్యం ఉంటుంది. ఇన్ఫెక్షన్లు, వ్యాధులు బారిన పడకుండా మంచి పుష్టితో ఆరోగ్యవంగా ఉంటాయి. బ్రెజిల్‌లోని సావో పాలోలోని అరండూలో జరిగిన వేలంలో నెల్లురు జాతికి చెందిన వయాటినా-19 ఎఫ్‌ఐవి మారా ఇమోవీస్ బ్రీడ్‌ ఆవు రికార్డ్ సృష్టించింది.  నాలుగున్నార సంవత్సరాల వయసున్న ఆవు 6.99 మిలియన్ రియల్‌లకు విక్రయింయించారు. ఇది ఇండియన్ కరెన్సీలో రూ.40కోట్లకు సమానం. 

తక్కువ మేతతో వృద్ధి చెందగల సామర్థ్యం, వీటి పోషణ సులభం అందుకే ఆ ఆవులకు బ్రెజిల్ లో చాలా డిమాండ్ ఉంది. ఈ జాతిని 1868లోనే బ్రెజిల్‌కు తరలించారు. నెల్లూరు జాతి ఆవులు బ్రెజిల్ ఆవు సంఖ్యలో 80 శాతం ఉన్నాయట. భవిషత్ లో ఈ బ్రీడ్ ఆవుల  పిండాలు, వీర్యం వంటి వాటిని సేకరించి వాటి సంతానాన్ని మరింతగా ఉత్పత్తి చేసేందుకు వీలుంటుంది.

Also Read: హైదరాబాద్ లోని ఆఫీసులకు ఆంధ్రప్రదేశ్ అద్దె కట్టాల్సిందే..