
సిడ్నీ: దేశం తరఫున తొలి సిరీస్‌ను గెలవడం.. తన జీవితంలో మర్చిపోలేని అనుభూతి అని టీమిండియా పేసర్ నటరాజన్ అన్నాడు. ఇది తనకు చాలా స్పెషల్ అని చెప్పాడు. ‘నా కంట్రీ తరఫున నాకు ఇదే తొలి సిరీస్. ఇది నాకు మెమరబుల్ అండ్ స్పెషల్’ అని నటరాజన్ ట్వీట్ చేశాడు. రెండో టీ20లో కీలక టైమ్‌లో షార్ట్, హెన్రిక్‌ను ఔట్ చేయడం ద్వారా మ్యాచ్‌ను ఇండియా వైపు మళ్లించాడు. దీంతో అద్భుతమైన బౌలింగ్‌తో ఆకట్టుకున్న ఈ తమిళ్ కుర్రాడిని.. ఆసీస్ బౌలింగ్ లెజెండ్ గ్లెన్ మెక్‌గ్రాత్ ప్రశంసల్లో ముంచెత్తాడు. ఈ టూర్‌లో ఇండియా ఓ మంచి బౌలర్‌ను కనిపెట్టిందని కొనియాడాడు. ‘నటరాజన్ బౌలింగ్‌తో చాలా ఇంప్రెస్ అయ్యా. ఈ టూర్‌లో అతను టీమిండియాకు దొరికిన ఆణిముత్యం. ఇదే ఫామ్‌ను కొనసాగిస్తాడని ఆశిస్తున్నా’ అని కామెంట్రీ సందర్భంగా మెక్‌గ్రాత్ వ్యాఖ్యానించాడు.