
ఒక చిన్న సాధారణ మార్పుతో అధిక రక్తపోటు అంటే బిపి (High Blood Pressure)ని కంట్రోల్లో ఉంచుకోవచ్చు. అవును... నిజమే.. మనం ప్రతిరోజు వంటల్లో వాడే సాధారణ ఉప్పుకు బదులు ఉప్పు ప్రత్యామ్నాయాలను (Salt Substitutes) వాడటం వల్ల బిపిని కంట్రోల్లో పెట్టుకోవచ్చు. ఇవన్నీ రక్తపోటును తగ్గించడంలో చాలా సహాయపడతాయి.
అధిక రక్తపోటు కంట్రోల్ చేసుకునేందుకు పెద్ద పెద్ద హాస్పిటళ్లు, వ్యాయామాలు, రకరకాల మందులు వాడాల్సిన అవసరం లేదు. ఉప్పుకు బదులు జస్ట్ వేరే ఉప్పు వాడితే మన శరీరానికి ఎంతో మేలు చేయవచ్చు.
రక్తపోటు(BP) పెరగడంలో సోడియం పాత్ర గురించి అవగాహన పెరుగుతున్నప్పటికీ, ఆశ్చర్యకరంగా చాలా తక్కువ మంది మాత్రమే ఈ ఉప్పు ప్రత్యామ్నాయాలను వాడుతున్నారు. ఓ పరిశోధన ప్రకారం, 5% కంటే తక్కువ మంది అమెరికన్లు మాత్రమే ప్రతిరోజు ఉప్పు ప్రత్యామ్నాయాలను ఉపయోగిస్తున్నట్లు తెలిసింది.
పరిశోధకులు చెప్పినట్లుగా, మన తినే ఆహారంలో ఈ చిన్న మార్పు నిజంగా రక్తపోటును తగ్గించడానికి ఒక శక్తివంతమైన ఆయుధం కావచ్చు, కానీ దీన్ని చాలా మంది పట్టించుకోకుండా వదిలేస్తుంటారు. 2013-2014లో ఉప్పు ప్రత్యామ్నాయాల వాడకం 5.4%తో అత్యధికంగా ఉంటే, 2020 ప్రారంభంలో కేవలం 2.5%కి పడిపోయింది. అధిక రక్తపోటు ఉన్నవారు ఇంకా కంట్రోల్లో ఉన్నవారు కూడా 3.6% నుండి 10.5% మధ్య మాత్రమే వీటిని ఉపయోగించారు.
ఉప్పు ప్రత్యామ్నాయాలు అంటే ఏమిటి: ఉప్పు ప్రత్యామ్నాయాలు అంటే సోడియం క్లోరైడ్ (సాధారణ ఉప్పు) లో కొంత భాగాన్ని లేదా మొత్తాన్ని పొటాషియం క్లోరైడ్ వంటి వాటితో భర్తీ చేసే ఉత్పత్తులు. సోడియం తీసుకోవడం తగ్గించి, పొటాషియం పెంచడానికి ఇవి ఒక సులువైన మార్గం. ఈ రెండు ఆహార అలవాట్లు/మార్పులు రక్తపోటు తగ్గడానికి గట్టి సంబంధం ఉంది.
అందరికీ మంచిదేనా.. జాగ్రత్తలు అవసరమా:
*ఉప్పు ప్రత్యామ్నాయాలు గుండె ఆరోగ్యానికి మేలు చేసిన, అవి అందరికీ సరైనవి కావు.
*మూత్రపిండాల (కిడ్నీ) వ్యాధి ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి.
*పొటాషియం స్థాయిలను ప్రభావం చేసే మందులు వాడేవారు కూడా జాగ్రత్త వహించాలి.
ఎందుకంటే పొటాషియం అధికంగా ఉండటం వల్ల తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వస్తాయి. మీ ఆరోగ్యానికి సంబంధించిన ఏదైనా సలహాలు/ సూచనలు తీసుకునే ముందు మీ డాక్టరుని సంప్రదించాలి.
సోడియం తగ్గించడానికి ఇతర మార్గాలు:
ఉప్పు ప్రత్యామ్నాయాలు మీకు నచ్చకపోతే, సోడియం తీసుకోవడం తగ్గించడానికి ఇంకా చాలా రుచికరమైన, గుండెకు మేలు చేసే మార్గాలు ఉన్నాయి....
* తులసి, ఒరేగానో, జీలకర్ర, పసుపు లేదా మిరపకాయ వంటివాటిని వంటల్లో ఎక్కువగా ఉపయోగించండి.
*వంటలకు మంచి ఫ్లేవర్ (రుచి) ఇవ్వడానికి నిమ్మ లేదా నారింజ తొక్క లేదా రసాన్ని కలపండి.
* వెల్లుల్లి, ఉల్లిపాయ లేదా అల్లంను తప్పకుండ ఉపయోగించండి.
*ఉప్పు లేని (Salt-free) మసాలాలని ప్రయత్నించండి.
*డబ్బాల్లో నిల్వ చేసిన లేదా ప్రాసెస్ చేసిన ఫుడ్ కాకుండా ఫ్రెష్ లేదా ఫ్రోజెన్ కూరగాయలను ఉపయోగించండి.