ఈ సారి సమ్మర్ హాలీడేస్ 18 రోజులే

ఈ సారి సమ్మర్ హాలీడేస్ 18 రోజులే
  • మే 17 నుంచి టెన్త్‌‌  ఎగ్జామ్స్‌‌.. మే 27 నుంచి సెలవులు

హైదరాబాద్, వెలుగు: రాష్ర్టంలోని బడుల్లో వచ్చే నెల ఒకటో తేదీ నుంచి మే 26 వరకు ఫిజికల్ క్లాసులు జరగనున్నాయి. మే17 నుంచి 26 వరకు టెన్త్ ఎగ్జామ్స్ నిర్వహించనున్నారు. తొమ్మిది, పదో తరగతి క్లాసులకు సంబంధించి 2020–21 అకడమిక్ క్యాలెండర్​ను ప్రభుత్వం రిలీజ్ చేసింది. ఈ మేరకు విద్యాశాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ చిత్రారాంచంద్రన్ శనివారం ఉత్తర్వులు జారీచేశారు. ఫిబ్రవరి ఫస్ట్ వీక్​లో స్టేట్​లెవెల్ లో ఇన్​స్పైర్​ ప్రోగ్రాం నిర్వహించనున్నారు. ఫిబ్రవరిలో ఇప్పటివరకు జరిగిన పాఠాలను ఆన్ లైన్ లో రివిజన్​ చేస్తారు. మార్చి, ఏప్రిల్​నెలల్లో  తొమ్మిది, పదో తరగతి స్టూడెంట్స్​కు రెండు ఫార్మేటివ్‌‌‌‌ అసెస్‌‌‌‌మెంట్‌‌‌‌ (ఎఫ్ఏ) ఎగ్జామ్స్​పెడతారు.  తొమ్మిదో క్లాస్ స్టూడెంట్స్​కు మే 7 నుంచి 13 వరకు సమ్మేటివ్ అసెస్​మెంట్ (ఎస్ఏ), అదే నెల 26న పేరెంట్స్ మీటింగ్ నిర్వహించి రిజల్ట్ ప్రకటిస్తారు. మే 17 నుంచి 26 వరకు టెన్త్ ఎగ్జామ్స్ నిర్వహిస్తారు. టెన్త్​లో ఆరు సబ్జెక్టులకు గాను ఆరు పేపర్లకు ఎగ్జామ్స్ పెట్టాలని నిర్ణయించారు. మే 27 నుంచి జూన్​13 వరకు 8 రోజులపాటు స్కూళ్లకు సమ్మర్ హాలీడేస్ ఉంటాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 2021-=22 అకడమిక్ ఇయర్ జూన్ 14 నుంచి ప్రారంభమయ్యే అవకాశముంది. సెప్టెంబర్ 1 నుంచి జనవరి 30 వరకు 115 రోజులపాటు ఆన్​లైన్​క్లాసులు, ఆ తర్వాత 89 రోజులు ఆఫ్​లైన్ లో పాఠాలు చెప్తామని అకడమిక్ క్యాలెండర్​లో పేర్కొన్నారు.

ఎగ్జామ్స్ కు 70 శాతం సిలబస్..

70 శాతం సిలబస్‌‌‌‌నే టీచర్లు పరిగణలోకి తీసుకుని బడుల్లో,ఆన్​లైన్​లో పాఠాలు చెప్తారని ప్రభుత్వం తెలిపింది. మిగిలిన 30శాతం సిలబస్ నుంచి టీచర్లు, పేరెంట్స్​ గైడెన్స్​లో ప్రాజెక్ట్ వర్క్​, అసైన్​మెంట్లు నిర్వహిస్తారు. 9,10 క్లాసుల ఎగ్జామ్స్​కు స్టూడెంట్స్ కు అటెండెన్స్​తప్పనిసరి కాదని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. స్టూడెంట్స్ బడులకు రావాలంటే  పేరెంట్స్ నుంచి పర్మిషన్ లెటర్ తీసుకురావాలన్నారు. స్కూల్స్ ఓపెన్ చేయడానికి ముందే​ఎస్ఎంసీ, పేరెంట్స్ మీటింగ్​తప్పనిసరిగా పెట్టాలని, దీంట్లో కోవిడ్, ఇమ్యూనిటీ డెవలప్​మెంట్, ఫిజికల్ డిస్టెన్స్​తదితర అంశాలపై అవేర్​నెస్​ కల్పించాలని సూచించారు.

బడుల్లో యోగా…

స్కూళ్లు ప్రారంభమయ్యాక పిల్లల్లో ఆత్మస్థైర్యం కల్పించేందుకు సింపుల్ యోగా ఎక్సర్ సైజ్​తప్పనిసరిగా చేయించాలి. పిల్లల్లో అలసట, ఒత్తిడి తగ్గించేందుకు కో కరికూలమ్ యాక్టివిటీస్ నిర్వహించాలి. మ్యాథ్స్​గేమ్స్, వర్డ్స్​అంత్యాక్షరి తదితర కార్యక్రమాలు నిర్వహించాలి. పిల్లలకు రెగ్యులర్​గా హెల్త్ చెకప్​ చేయించాలి. స్టాఫ్, స్టూడెంట్స్​కు వేర్వేరుగా ఐసోలేషన్​ రూమ్స్​ఏర్పాటు చేయాలి అని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

స్కూల్ టైమింగ్స్​

జిల్లాలు: ఉద‌‌‌‌యం 9:30 నుంచి సాయంత్రం 4:45 గం.ల వ‌‌‌‌ర‌‌‌‌కు

జంటనగరాలు: ఉద‌‌‌‌యం 8:45 నుంచి సాయంత్రం 4 గం.ల వ‌‌‌‌ర‌‌‌‌కు

ఆన్​లైన్ క్లాసులు

టెన్త్​:  ఉద‌‌‌‌యం 10 నుంచి 11 గం.ల వరకు రెండు పీరియడ్లు

తొమ్మిదో తరగతి:  సాయంత్రం 4 నుంచి 5 గం.ల వరకు రెండు పీరియడ్లు

ఎగ్జామ్స్​ షెడ్యూల్

మార్చి15 లోగా: 9,10 క్లాసులకు ఫార్మేటివ్‌‌‌‌ అసెస్‌‌‌‌మెంట్‌‌‌‌ (ఎఫ్​ఏ)-1

ఏప్రిల్‌‌‌‌15 లోగా: 9,10 క్లాసులకు  ఫార్మేటివ్‌‌‌‌ అసెస్‌‌‌‌మెంట్‌‌‌‌(ఎఫ్​ఏ) -2

మే 7 – మే13 :  9వ తరగతికి సమ్మేటివ్‌‌‌‌ అసెస్‌‌‌‌మెంట్‌‌‌‌ (ఎస్‌‌‌‌ఏ)

మే 17- మే 26 : టెన్త్ ఎగ్జామ్స్.