V6 News

కమ్ముకున్న యుద్ధ మేఘాలు! ఆ దేశంపై హైబ్రిడ్ అటాక్.. ఫైటర్ జెట్లను సిద్ధం చేసిన నాటో కంట్రీ

కమ్ముకున్న యుద్ధ మేఘాలు! ఆ దేశంపై హైబ్రిడ్ అటాక్.. ఫైటర్ జెట్లను సిద్ధం చేసిన నాటో కంట్రీ

నాటో కూటమిలో ఉన్నందుకు ఉక్రెయిన్ అను నిత్యం రష్యాతో పోరాటం చేయాల్సి వస్తూనే ఉంది. అమెరికా సంధి చేయాలని చూసినా కూడా అక్కడ బాంబుల మోత ఆగడం లేదు. మరో దేశంలో కూడా అలాంటి పరిస్థితులే వస్తున్నాయా..? అనేంతలా దేశంలో ఎమర్జెన్సీ ప్రకటించారు. ఎయిర్ పోర్టులన్నీ షట్ డౌన్ చేశారు. ఫైటర్ జెట్లను సిద్ధం చేసి ఉంచారు. లిథువేనియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు ప్రపంచాన్ని కలవరపెడుతున్నాయి. 

మంగళవారం (డిసెంబర్ 09) నేషనల్ ఎమర్జెన్సీ ప్రకటించిందే లిథువేనియా దేశం. శత్రు దేశం బెలారస్ బెలూన్స్ పంపించి హైబ్రిడ్ అటాక్ చేస్తోందని ఆరోపించింది. పెద్ద పెద్ద బెలూన్లు లిథువేనియా గగన తలంలో తేలియాడుతుండటంతో దేశ ప్రజలందరూ తీవ్ర ఆందోళనకు గురయ్యారు. బెలూన్లతో ఏం చేస్తున్నారు.. బాంబులు వేస్తున్నారా..? వేరే రకమైన దాడి ఏమైనా చేస్తున్నారని అనే భయాలతో ప్రజలంతా బిక్కుబిక్కు మంటున్న తరుణంలో ఎమర్జెన్సీ ప్రకటించింది. 

గగనతలంలో బెలూన్లు ఎయిర్ ట్రాఫిక్ కు కారణమయ్యాయని లిథువేనియా అధికారులు తెలిపారు. దీంతో విలినియస్ ఎయిర్ పోర్టును మూసి వేసినట్లు ప్రకటించారు. 

లిథువేనియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులకు కారణం.. ఆ దేశం నాటో కూటమిలో ఉండటం. తమకు ఉక్రెయిన్ లాగే లిథువేనియా నుంచి కూడా ముప్పు ఉంటుందని రష్యా భావిస్తుంటుంది. అదే విధంగా రష్యా నుంచి ముప్పు ఉందని లిథువేనియా అనుమానం వ్యక్తం చేస్తుంటుంది. ఈ క్రమంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ మద్ధతుతో బెలారస్ ప్రసిడెంట్ అలెగ్జాండర్ లుకషెంకో.. తమ దేశాన్ని టార్గెట్ చేస్తున్నట్లు లిథువేనియా ఆరోపిస్తోంది.

హైబ్రిడ్ అటాక్ ఏంటి..?

బెలూన్స్ (పెద్ద పెద్ద బుంగలు) తమ దేశంలో ఉద్రిక్త పరిస్థితులు తెచ్చిపెట్టాయని లిథువేనియా ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. సిగరెట్స్ స్మిగ్లింగ్ కోసం బెలారస్ ఈ బెలూన్స్ వాడుతుంటుందని తెలిపారు. స్మిగ్లింగ్ బెలూన్స్ అయినప్పటికీ.. అది ఉద్దేశ పూర్వకంగా రెచ్చగొట్టేందుకు బెలారస్ చేస్తున్న పనిగా ఆరోపిస్తున్నారు. దేశంలో అనిశ్చితి నెలకొల్పేందుకు రష్యా సపోర్ట్ తో బెలారస్ చేస్తున్న పనిగా అభివర్ణించారు. 

ఈ ఆరోపణలను బెలారస్ తోసిపుచ్చింది. లిథువేనియానే తమ దేశాన్ని రెచ్చగొడుతోందని ఆరోపించింది. అప్పుడప్పుడు డ్రోన్స్ తో దాడి చేస్తూ తమ దేశంలో టెన్షన్ వాతావరణాన్ని క్రియేట్ చేస్తోందని విమర్శించింది ఆ దేశం. 

వాతావరణ పరిస్థితులను అంచనా వేసేందుకు బెలూన్స్ పంపుతున్నామని.. కానీ అవి ఒక్కోసారి అదుపు తప్పి లిథువేనియాలోకి వెళ్తున్నాయని బెలారస్ తెలిపింది. దీన్ని హైబ్రిడ్ అటాక్ గా అభివర్ణించి యుద్ధానికి కాలుదువ్వుతోందని ఆరోపించింది.