ఈ వారం థియేటర్స్, ఓటీటీలో సందడి చేయనున్న సినిమాలు

ఈ వారం థియేటర్స్, ఓటీటీలో సందడి చేయనున్న సినిమాలు

తెలుగు, తమిళం, కన్నడ,మలయాళం హిందీ, ఇంగ్లీష్..ఇలా భాషతో సంబంధం లేకుండా ప్రతి వారం సినిమాలు రిలీజ్ అవుతూనే ఉంటాయి. అందులో కొన్ని ప్రేక్షకులను అలరిస్తే మరికొన్ని నిరాశపరుస్తాయి. ఇక ఈ వారం కూడా థియేటర్, ఓటీటీల్లో కొత్త కొత్త సినిమాలు విడుదల అవుతున్నాయి. మరి సినిమా ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం.

థియేటర్లో రిలీజ్ అయ్యే మూవీస్.. 

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్(Varun Tej) హీరోగా,సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తున్న మూవీ గాండీవధారి అర్జున(Gandeevadhari Arjuna). స్టైలీష్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు(Praveen sattaru) తెరకెక్కిస్తున్న ఈ అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్..నెక్స్ట్ లెవల్ యాక్షన్ సీన్స్, కారు చేజింగ్‍లతో వచ్చిన ఈ ట్రైలర్ మూవీపై అంచనాలను పెంచేసింది.ఈ సినిమా రన్ టైం కూడా 2 గంటల 20 నిమిషాలు మాత్రమే ఉండేలా మేకర్స్ ప్రకటించారు. ఇక ఈ సినిమా ఆగస్టు 25న ఈ సినిమా థియేటర్‌లలో రిలీజ్ కానుంది.

సీతారామం వంటి క్లాసికల్ హిట్‌‌‌‌‌‌‌‌తో తన క్రేజ్‌‌‌‌‌‌‌‌ను మరింత పెంచుకున్నారు దుల్కర్ సల్మాన్(Dulquer Salmaan). డిఫరెంట్ స్టోరీలను సెలెక్ట్ చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న దుల్కర్..ఇక లేటెస్ట్ గా కింగ్ ఆఫ్ కోతా(King of Kotha) అనే మూవీతో వస్తున్నారు. దుల్కర్ సల్మాన్ కు జోడీగా హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి నటిస్తుంది. అభిలాష్‌ జోషిలీ డైరెక్ట్ చేస్తున్నఈ మూవీ ఆగస్ట్ 24న థియేటర్‌లో రిలీజ్ కానుంది. 

టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ RX100 మూవీతో ఎంట్రీ ఇచ్చి అదరగొట్టాడు.ఇప్పుడు హీరో, విలన్ పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. డైరెక్టర్ RGV శిష్యుడు తెరకెక్కిస్తున్న బెదురు లంక 2012 మూవీ ఆగస్టు 25న థియేటర్‌లో విడుదల కానుంది.ఈ మూవీలో హీరో కార్తికేయ,డీజే టిల్లు ఫేమ్ నేహా శెట్టి నటిస్తున్నారు.

నితిన్ కృష్ణమూర్తి(Nithin Krishnamurthy) డైరెక్షన్ లో తెరకెక్కిన యూత్ క్రేజీ కామెడీ ఎంటర్‌టైనర్ బాయ్స్ హాస్టల్. ఈ మూవీ  2023లో కన్నడలో అతిపెద్ద బ్లాక్‌బస్టర్. ఇప్పుడు తెలుగులో ఆగస్టు 26న థియేటర్‌లో విడుదలవుతోంది.  


డెబ్యూ డైరెక్టర్ భరత్‌ మిత్ర తెరకెక్కిస్తున్న ఏం చేస్తున్నావ్‌ మూవీ ఆగస్టు 25 న థియేటర్‌లో రిలీజ్ చేస్తున్నారు. ఈ మూవీలో డైరెక్టర్ భరత్ మిత్ర తమ్ముడు విజయ్‌ రాజ్‌ కుమార్‌ హీరోగా..నేహా పటాని హీరోయిన్ గా నటిస్తుంది.ఈ మూవీకి ఫీల్ గుడ్ మ్యూజిక్ డైరెక్టర్ గోపి సుందర్ సాంగ్స్ మంచి మెలోడీ సాంగ్స్ కంపోజ్ చేశారు.  

ఓటీటీలో రిలీజయ్యే మూవీస్..  

ఈ వారం ఓటీటీలోకి సక్సెస్ ఫుల్ మూవీస్ తో పాటు పలు వెబ్ సిరీస్ లు రాబోతున్నాయి. అందులో ముఖ్యంగా పవన్‌కల్యాణ్‌ - సాయిధరమ్‌ తేజ్‌ బ్రో మూవీ  ఆగస్టు 25న నెట్​ఫ్లిక్స్​లోకి రాబోతుంది. ఈ సినిమా జులై 28న ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని సాధించింది. తమిళ హిట్ మూవీ వినోదయ సీతం కు రీమేక్ గా వచ్చిన ఈ సినిమాను సముద్రఖని తెరకెక్కించారు. 

బేబీ సినిమా ఓటీటీ రిలీజ్ కు సిద్ధమైంది. థియేట్రికల్ రన్ ముగించుకున్న ఈ సినిమా  ఆగస్టు 25 నుంచి ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా(Aha)లో స్ట్రీమింగ్ కానుంది. దీంతో ఆడియన్స్ బేబీ సినిమాను మరోసారి చూడటానికి రెడీ అవుతున్నారు. మరి థియేటర్స్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచిన బేబీ సినిమాకు ఓటీటీలో ఎలాంటి రిజల్ట్ దక్కనుందో చూడాలి. 

హాలీవుడ్ లో రిలీజ్ అయినా కిల్లర్‌ బుక్‌ క్లబ్‌ మూవీ ఆగస్టు 25న నెట్​ఫ్లిక్స్ లో రాబోతుంది. హిందీ సిరీస్ లో వచ్చిన ఆఖ్రి సోచ్ మూవీ డిస్నీ+ హాట్ స్టార్ లో ఆగష్టు 25 న, హిందీలో రిలీజైన బజావ్ మూవీ ఆగస్టు 25 న జియో సినిమాలో, హాలీవుడ్‌ మూవీ లయన్స్‌గేట్‌ప్లేలో ఎబౌట్‌ మై ఫాదర్‌ మూవీ ఆగస్టు 25న  జియో సినిమాలో

హాలీవుడ్‌ మూవీ సమ్‌వేర్‌ ఇన్‌ క్వీన్స్‌  ఆగస్టు 21న బుక్‌ మై షోలో,  
హిందీ లో రిలీజైన లఖన్‌ లీలా భార్గవ మూవీ ఆగస్టు 21న ,
వెబ్‌సిరీస్‌ న్వాజిన్‌2 ఆగస్టు 23 నుంచి యాపిల్‌ టీవీ ప్లస్‌ లో స్ట్రీమింగ్ కానున్నాయి.