తెలంగాణలో మరో ఉద్యమం మొదలైంది

V6 Velugu Posted on May 04, 2021

కరీంనగర్: తెలంగాణలో మరో ఉద్యమం మొదలైందని టీఆర్ఎస్ మాజీ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. ఇప్పుడు జరగబోయేది ఆత్మగౌరవ పోరాటమన్నారు. తెలంగాణ NRI అమెరికా ఫోరం ఆధ్వర్యంలో నిర్వహించిన జూమ్ కాన్ఫరెన్స్‌‌లో ఈటల పైవ్యాఖ్యలు చేశారు. తెలంగాణ తెచ్చుకుంది కుటుంబ పాలన కోసమా అనే అంశంపై తనకు మద్దతుగా నిలిచిన పలువురు NRIలతో ఆయన మాట్లడారు.

‘నీళ్లు, నిధులు, నియామకాలను సదించుకుంటున్నం. ఇప్పుడు తెలంగాణలో మరో ఉద్యమం మొదలైంది. అదే ఆత్మ గౌరవ ఉద్యమం. పూర్తిగా తప్పుడు ఆరోపణలతో నన్ను బయటికి పంపారు. సిట్టింగ్ జడ్జితో నా మొత్తం వ్యాపారం, సంపాదించిన ఆస్తుల మీద విచారణ చేయించాలని సీఎంను కోరా. ఎంగిలి మెతుకుల కోసం ఆశపడను. ప్రజలను నమ్ముకున్నా. ప్రలోభాలకు లొంగ లేదు కాబట్టే ఈ నిందలు వేస్తున్నారు’ అని ఈటల మండిపడ్డారు. తనకు మద్దతుగా నిలిచిన NRIలకు ఈటల ధన్యవాదాలు తెలిపారు.

Tagged Land Scam Allegations, Telangana Ex Minister Etela Rajendra, NRI Forum

Latest Videos

Subscribe Now

More News