
హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా ఈ ఏడాది లోటు వర్షపాతం నమోదవుతుంది అన్నారు వాతావరణశాఖ అధికారి రాజారావు . ఉపరితల ఆవర్తనాలు, అల్పపీడనాలు ఏర్పడకపోవడమే వర్షాలు తక్కువగా పడానికి కారణమన్నారు. రాష్ట్రంలో దాదాపు 20 జిల్లాల్లో సాధారణం కంటే తక్కువ వర్షాలు కురిశాయని చెప్పారు.
ప్రస్తుతం ఉన్న లోటు వర్షపాతాన్ని..రానున్న రోజుల్లో కురిసే వర్షాలు భర్తీ చేసే అవకాశాలు లేవంటున్నారు. ఇక రానున్న రోజుల్లో తెలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిస్తాయని తెలిపారు వాతావరణశాఖ అధికారి రాజారావు.