
- మహరాజ్ గజపతి.. భూపతి.. ప్రజాపతి అంటూ స్టార్ట్
హైదరాబాద్: మహరాజ్ గజపతి..భూపతి..ప్రజాపతి..శ్రీ చత్రపతి శివాజీ మహరాజ్ చా విజయీభవ. హర హర మహాదేవ. వంటే మాతరం.. అంటూ మరాఠా సంప్రదాయ వస్త్రాలు ధరించి ఉన్న బ్యాండు మేళం వినా యకనవరాత్రి ఉత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దీనిని ధోల్ తకా పాతక్ అంటారు. మహారాష్ట్ర రాష్ట్ర సంప్రదాయ సంగీత సంస్కృ తిలో డోల్ తాషా పారక్ ఒక ప్రత్యేక స్థానాన్ని పొందుకుంది.
ఈ బ్యాండ్ మహారాష్ట్ర ప్రజల ఉత్సవాలకు, పండుగలకు, ఆధ్యాత్మిక కార్య క్రమాలకు వాడుతూ ఉంటారు. ఇది కేవలం సంగీతం మాత్రమే కాక, సాంస్కృతిక గుర్తిం పుగా, సమాజాన్ని కలిపే మాధ్యమంగా కూడా పనిచేస్తుంది. డోల్ తాషా రెండు వాయిద్యాల కలయిక అనే రోల్, తాషా బోల్ అనేది పెద్ద మృదు కొట్టే డ్రమ్, దీనిని చేతులతో కొడతారు. దీని బీట్స్ శక్తివంతంగా ఉంటాయి. తాషా ఒక చిన్న డ్రమ్ మెడలో ధరించి దీనిని కొడుతూ ఉంటారు. దీని వేగవంతమైన రిధమ్ ఉత్సవం లో ఉత్సాహాన్ని పెంచుతోంది.
ఈ వాయిద్యాల వాయించే కళాకారుల బృందం ముందుగా ఒక ఎంట్రీ నోట్ ఇస్తారు.. చివర మహారాష్ట్ర యోధుడు చత్రపతి శివాజీకి జై కొడతారు. ఆ తర్వాత భారత్ మాతాకీ జై. -వందే మాతరం అంటూ వాయిద్యం ప్రారం -భిస్తారు. వారి సమన్వయం, రిథమ్, శక్తి.. ఉత్సవాల్లో ప్రత్యేక ఉత్సహాన్ని నింపుతుంది. ఈ బృందంలో యువతులు కూడా ఉంటారు. -వీళ్లి ధరించిన తెలుగు రంగు కుర్తా పైజామా,కాషాయ రంగు పడి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.
దోల్ తాషా పాఠక్ మహారాష్ట్ర సంస్కృతి పరిరక్షణలో ఒక జీవమైన చిహ్నంగా నిలిచింది. ఒకప్పుడు ముంబైలోని నిమజ్జనోత్స వానికి మాత్రమే పరిమితమైన ఈ డోల్ తాషా పాఠక్ రెండు మూడేళ్లుగా హైదరాబాద్ కు వస్తోంది. ఉత్సవాల్లో ఉత్సాహం నింపుతోంది.