కొత్త అగ్రి చట్టాల గురించి రాహుల్‌‌కు ఏం తెలుసు?

కొత్త అగ్రి చట్టాల గురించి రాహుల్‌‌కు ఏం తెలుసు?

న్యూఢిల్లీ: కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీపై కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ విమర్శలకు దిగారు. కొత్త అగ్రి చట్టాల గురించి రాహుల్‌‌కు ఏం తెలుసని ప్రశ్నించారు. ‘రాజకీయ పార్టీలకు చెందిన నేతలకు అగ్రి చట్టాలతో సంబంధమే లేదు. ఈ చట్టాలను వెనక్కి తీసుకోవాలని రాహుల్ గాంధీతోపాటు పలువురు ప్రతిపక్ష నేతలు డిమాండ్ చేస్తున్నారు. కానీ రాహుల్ సహా మిగిలిన నేతలెవ్వరికీ ఈ చట్టాలపై కనీస అవగాహన లేదు. వారసత్వ రాజకీయాలు చేసే రాహుల్ లాంటి నేతలకు మిగతా వారిపై కామెంట్లు చేసే హక్కు లేదు. ఆయన నాయకత్వంలో కాంగ్రెస్ బలహీనపడుతోంది. బలహీన విపక్షం ఉండటం ప్రజాస్వామ్యానికి మంచిది కాదు’ అని తోమర్ చెప్పారు.