దేవుడిపై భ‌క్తుల్లో విశ్వాసం దెబ్బ‌తీసేలా ప్ర‌చారం చేస్తున్నారు

దేవుడిపై భ‌క్తుల్లో విశ్వాసం దెబ్బ‌తీసేలా ప్ర‌చారం చేస్తున్నారు

హైద‌రాబాద్: సోష‌ల్ మీడియా వేదిక‌గా కొంత మంది భ‌ద్రాద్రి ఆల‌యంపై దుష్ర్పచారం చేస్తున్నార‌ని దేవాలయ ఆగమ పురాణ సంరక్షణ సమితి ఆరోపించింది. శుక్ర‌వారం స‌మితి క‌న్వీన‌ర్ గంగు ఉపేంద్ర శ‌ర్మ, స‌భ్యులు హైద‌రాబాద్ లో మీడియాతో మాట్లాడారు. సంబంధంలేని వ్యక్తులు చేసే ఆరోపణలపై తెలంగాణ దేవాదాయ శాఖ తక్షణం స్పందించి, వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. శ్రీరాముడిని రామనారాయణ అనడం … సీతమ్మని సీతామహాలక్ష్మి అనడం పూర్తిగా తప్పన్నారు.

కానీ కొంత మంది సామాజిక మాధ్యమాల్లో అసత్య పదజాలంతో ప్రచారం చేస్తున్నారని.. దీనిపై ఒక పుస్తకం ప్రచురించి, భక్తులలో విశ్వాసం దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. భద్రాద్రి ఆలయంలో గత 350 ఏళ్లుగా ఆగమ శాస్త్ర నియమ, నిబంధనల ప్రకారమే నిత్యపూజ, కైంకార్యలు జరుగుతున్నాయని … ఇదే తరహాలో అన్ని హిందూ ఆల‌యాల్లో జరుగుతున్నాయని చెప్పారు. అన్నదమ్ముల్లాగ‌ కలిసిమెలిసి ఉన్న స్మార్త , వైష్ణవుల మధ్య కుల ఘర్షణలు రేపే విధంగా పోస్టులు చేస్తున్నారని.. వారిపై దేవాదాయ శాఖ కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.