- తోటకూర వజ్రేశ్ యాదవ్
మేడిపల్లి, వెలుగు: బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్‌ను కలిపే అన్ని ప్రధాన రహదారుల అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు మేడ్చల్ కాంగ్రెస్ ఇన్చార్జీ తోటకూర వజ్రేశ్ యాదవ్ తెలిపారు. చిలుకానగర్ నుంచి బోడుప్పల్ అంబేద్కర్ విగ్రహం వరకు రూ.10 కోట్లతో హెచ్‌ఎండీఏ మంజూరు చేసిన 100 ఫీట్ల రోడ్డు విస్తీర్ణ పనులకు సోమవారం ఆయన శంకుస్థాపన చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బోడుప్పల్ అభివృద్ధికి లక్షలాది రూపాయల నిధులు మంజూరు చేయించామన్నారు.
హెచ్‌ఎండీఏ నిధులతో బోడుప్పల్ – -చెంగిచర్ల, బోడుప్పల్ – -మల్లాపురం పారిశ్రామికవాడ, బోడుప్పల్– -చిలుకానగర్ రహదారులను విస్తరించి అభివృద్ధి చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో మాజీ మేయర్ తోటకూర అజయ్ యాదవ్, మాజీ కార్పొరేటర్లు కొత్తచందర్ గౌడ్, బొమ్మకు కల్యాణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
